యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
కంపెనీల సంఖ్యను పరిమితం చేయలేదు: రాజా
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 21 నవంబర్ 2008   ( 16:02 IST )
దేశంలోని టెలికాం సర్కిళ్లలో కంపెనీల సంఖ్యను పరిమితం చేసే అవకాశాలున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దీనికి సంబంధించి నిర్ణయమేదైనా ఉంటే అది ట్రాయ్ (భారత టెలికాం నియంత్రణ సంస్థ) దృష్టికి కూడా వెళుతుందని స్పష్టం చేసింది.

సర్కిళ్లలో టెలికాం కంపెనీల సంఖ్యను పరిమితం చేసే నిర్ణయం తాము తీసుకోబోమని కేంద్ర టెలికాం శాఖ మంత్రి ఏ.రాజా తెలిపారు. సెప్టెంబరు 25, 2007 వరకు వచ్చిన టెలికాం లైసెన్సులను తమ శాఖ పరిశీలించిందన్నారు. సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు 1 వరకు వచ్చిన దరఖాస్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

అయితే సర్కిళ్లలో కంపెనీల సంఖ్యను పరిమితం చేస్తారని, సెప్టెంబరు 25 తరువాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోరని ఊహాగానాలు జోరందుకున్నాయన్నారు. తాము ఇప్పటివరకు దీనిపై అటువంటి నిర్ణయమేదీ తీసుకోలేదని స్పష్టం చేశారు. టెలికాం కమిషన్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని తాను భావించడం లేదన్నారు.

ఒక వేళ తీసుకొని ఉన్నా, ఆ ప్రతిపాదనను ట్రాయ్‌కు పంపుతారని చెప్పారు. ఈ వ్యవహారంపై టెలికాం కమిషన్‌ను తాను ఇప్పటివరకు వివరణ కోరలేదని రాజా వెల్లడించారు.

టెలికాం కమిషన్ మొత్తం 575 దరఖాస్తులు పొందింది. వీటిలో 343 దరఖాస్తులు సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 1, 2007 మధ్యకాలంలో వచ్చాయి. ఈ మధ్య కాలంలో టెలికాం లైసెన్స్‌ కోసం ఏటీ అండ్ టీ, డీఎల్ఎఫ్, మోసర్ బేర్, ఇస్పాత్, స్టెర్లైట్ తదితర 24 కంపెనీలు దరఖాస్తులు చేసుకోగా, మొత్తం మీద 46 కంపెనీలు లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు పంపాయని రాజా తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కోలుకున్న మార్కెట్‌: సెన్సెక్స్ 464 పాయింట్ల వృద్ధి
ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగలం: ప్రధాని మన్మోహన్
1800 ఉద్యోగాలపై బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వేటు
శతాబ్దంలో ఒకటి, రెండుసార్లు సంక్షోభం సహజం
నష్టాల బాటలో సెన్సెక్స్: 323 పాయింట్ల పతనం
44 చమురు, బ్లాకులకు సీసీఈఏ ఆమోదం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
డబ్బింగ్ పూర్తి చేసుకున్న పండుగాడు
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్, హన్సిక హీరోహీరోయిన్లుగా రూపొందిన "బిందాస్"...
తూగోలో ఓ ఉదయం... ఓ సాయంత్రం
అందమైన అబద్ధం ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...