|
| ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగలం: ప్రధాని మన్మోహన్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 16:02 IST ) | |
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడకుండా చూసేందుకు అన్ని నివారణ చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించగలదని నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకొని తిరిగి సాధారణ స్థితికి వచ్చే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధాని తెలిపారు. 1991 నాటికి ఆర్థిక సంక్షోభం ఇంతకన్నా తీవ్రస్థాయిలో ఉంది. అయితే భారత్ దానిని సమర్థవంతంగా అధిగమించగలిగిందన్నారు.
తాజా సంక్షోభం నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. వార్షిక ద్రవ్య విధానాలు, ప్రభుత్వ పెట్టుబడులు, మార్పిడి రేట్లు ఇలా అన్ని కోణాల్లోనూ సంక్షోభాన్ని నివారించే చర్యలు చేపడతామని చెప్పారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం జరుగుతున్న హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ప్రపంచం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. గడ్డుకాలం గుండా పయనిస్తోంది. ప్రపంచీకరణ విధానాలు రంగ ప్రవేశం తరువాత ఆ ప్రభావం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. అయితే వృద్ధి రేటును ఎనిమిది శాతం మేర కొనసాగించే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|