|
| 1800 ఉద్యోగాలపై బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వేటు |
| న్యూయార్క్ (ఏజెన్సీ), శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 13:11 IST ) | |
బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్ కార్పొరేషన్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్యను నాలుగు శాతం మేర తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా 1800 ఉద్యోగాలపై వేటు వేసే ఆలోచనలో ఉన్నట్లు బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్ తెలిపింది. నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు ఛైర్మన్ రాబర్ట్ పి కెల్లీ వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్ (బీఎన్‌వై మెలన్)కు 43 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఏడాది బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్, మెలన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విలీనంతో బీఎన్‌వై మెలన్ ఆవిర్భవించింది. ఈ సంస్థ 34 దేశాల్లో తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంపన్నులు, కార్పేరేట్లు, ఇతర సంస్థలకు ఆర్థిక సేవలు అందిస్తున్న ఈ బ్యాంకుకు 1.1 ట్రిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|