|
| స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం: 8.90 శాతంగా నమోదు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008 ( 13:35 IST ) | |
ద్రవ్యోల్బణం నవంబరు 8తో ముగిసిన వారాంతానికి స్వల్పంగా తగ్గి 8.90 శాతానికి చేరుకుంది. అంతకుముందు వారం 8.98 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణం తాజాగా మరింత తగ్గడంతో రిజర్వు బ్యాంకు ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య సరఫరాను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంధన ధరలు తగ్గడం తాజాగా టోకు ధరల సూచి 0.08 శాతం తగ్గడానికి ప్రధాన కారణమైంది. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు భారీగా తగ్గడంతో దేశీయ మార్కెట్‌లోనూ ఇంధన ధరలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.
లైట్ డీజిల్ ఆయిల్ (ఎల్‌డీవో) ధర ఈ వారంలో 11 శాతం తగ్గింది. ఫర్నల్ ఆయిల్, విమాన ఇంధనం ధరలు వరుసగా తొమ్మిది శాతం, ఐదు శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే వారాంతానికి ద్రవ్యోల్బణం 3.20 శాతం వద్ద ఉంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|