|
| మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ భారీ పతనం |
| ముంబయి (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008 ( 11:30 IST ) | |
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) గురువారం కూడా నష్టాల్లో పయనిస్తోంది. ఉదయం లావాదేవీల్లో 386 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ వరుసగా ఏడు సెషన్‌లోనూ నష్టాల్లోనే కొనసాగుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం భారత మార్కెట్‌లపై ప్రభావం చూపింది.
గత ఆరు సెషన్లలో 1,750 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ భారీ అమ్మకాల కారణంగా గురువారం ప్రారంభంలో మరో 386.80 పాయింట్లు పతనమై 8,386.98 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే ఉంది. నిఫ్టీ ఉదయం పూట లావాదేవీల్లో 116.60 పాయింట్లు (3.72 శాతం) పతనమై 2,518.40 వద్ద కొనసాగుతోంది.
ఫెడరల్ రిజర్వు బ్యాంకు 2009 సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలు తగ్గించడంతో ముందురోజు అమెరికా స్టాక్ మార్కెట్ సూచి 5.07 శాతం పతనమై ఐదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ పరిణామం గురువారం ఆసియా మార్కెట్‌లను ప్రభావితం చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఆర్‌కామ్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, సత్యం కంప్యూటర్స్, టీసీఎస్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీల వాటాలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆసియా మార్కెట్‌లు కూడా ఈ రోజు ఉదయం భారీగా పతనమయ్యాయి. హాంకాంగ్‌లోని హాంగ్‌సెంగ్ 5.35 శాతం పతనమవగా, జపాన్ నిక్కీ 4.32 శాతం పతనమైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|