|
| మరోసారి రికార్డు స్థాయిలో రూపాయి పతనం |
| ముంబయి (ఏజెన్సీ), గురువారం, 20 నవంబర్ 2008 ( 10:52 IST ) | |
రూపాయి విలువ మరోసారి రికార్డు స్థాయి పతనాన్ని చవిచూసింది. గురువారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 50.50కి చేరింది. ఉదయం 9:01 గంటల సమయంలో రూపాయి విలువ 50.45/47కి పడిపోయింది. రూపాయి మారకపు విలువ గత నెలలోనూ రికార్డు స్థాయిలో పతనమై 50.29కి చేరింది. ఇదిలా ఉంటే బుధవారం 50.02/03 వద్ద ముగిసింది.
అక్టోబరు 27న 50పైకి చేరిన రూపాయి, అదే రోజు కొద్ది మేర కోలుకొని 49.95 వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి డాలర్‌తో రూపాయి మారకపు విలువ 27 శాతం పతనమైంది. ఆ సమయంలో రూపాయి మారకపు విలువ 39.42 వద్ద ఉంది. విదేశీ సంస్థలు తమ భారతీయ వాటాలను విక్రయించుకోవడం ప్రారంభించడంతో ఈ ఏడాది మే నుంచి రూపాయి పతనమవుతోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|