యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
నష్టాల బాటలో సెన్సెక్స్: 163 పాయింట్ల పతనం
ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 17:00 IST )
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) బుధవారం నష్టాల బాటలో పయనించింది. అంతర్జాతీయ మార్కెట్‌ల సానుకూల సంకేతాలతో 34 పాయింట్లు వృద్ధి చెంది 8,971 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, అనంతరం కూడా కొంతసేపు లాభాల్లోనే కొనసాగింది. ఒకానొక దశలో క్రితం ముగింపుతో పోలిస్తే 299 పాయింట్లు వృద్ధి చెంది 9,236 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది.

బ్యాంకింగ్, సాంకేతిక తదితర రంగాల వాటాలు బలహీనపడటంతో నష్టాల్లోకి అడుగుపెట్టిన బీఎస్ఈ సూచి ముగింపు సమయానికి 163 పాయింట్లు కోల్పోయి 8,774 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే పయనించింది. నిఫ్టీ ముగింపు సమయానికి 48 పాయింట్లు కోల్పోయి 2635 వద్ద నిలిచింది.

మార్కెట్ లావాదేవీల్లో జైప్రకాశ్ అసోసియేట్స్ వాటాలు 6 శాతం, హిందాల్కో వాటాలు 5 శాతం, గ్రాసిం వాటాలు 4.6 శాతం, ఎల్ అండ్ టీ వాటాలు 4 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు వాటాలు 3.7 శాతం నష్టపోయాయి. ఐటీసీ వాటాలు 3 శాతం లాభపడగా, రాన్‌బాక్సీ వాటాలు 2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 1 శాతం పుంజుకున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మారుతీ సుజుకీ ఎ- స్టార్ ఆవిష్కరణ
ధరలు కిందకి దిగి వస్తాయి: అహ్లువాలియా
సిటీ ఉద్యోగాల కోత ప్రభావం భారత్‌పై పాక్షికమే
ధరలు తగ్గింపునకు పరిశ్రమల విముఖత
మార్కెట్‌‍లో నష్టాలు: సెన్సెక్స్ 354 పాయింట్ల పతనం
కింగ్‌ఫిషర్‌లో వాటాపై విదేశీ సంస్థల ఆసక్తి: మల్యా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...