యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
మారుతీ సుజుకీ ఎ- స్టార్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 19 నవంబర్ 2008   ( 15:34 IST )
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) బుధవారం ఎ- స్టార్ మోడల్ కారును ఆవిష్కరించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మరో నాలుగేళ్లలో కొత్త కారును తయారు చేయనున్నట్టు మారుతీ సుజుకీ ఈ సందర్భంగా ప్రకటించింది.

తాజాగా కంపెనీ ఆవిష్కరించిన ఎ- స్టార్ కారు ప్రవేశ ధర రూ.3.47 లక్షల నుంచి రూ.4.12 లక్షల వరకు ఉంటుందని కంపెనీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐవీ రావు తెలిపారు. ఇదిలా ఉంటే స్వదేశీ పరిజ్ఞానంతో కారు తయారు చేసేందుకు ఇప్పటికీ ప్రాథమిక చర్యలు చేపట్టామని చెప్పారు.

రాబోయే నాలుగేళ్లలో ఇది మార్కెట్‌లోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. తాజాగా ఆవిష్కరించిన ఎ- స్టార్ కంపెనీకి చెందిన ఐదో అంతర్జాతీయ మోడల్.

ఈ మోడల్ కారును కేవలం భారత్‌లో మాత్రమే తయారు చేస్తారు. దేశీయ మార్కెట్‌లో 50 వేల ఎ- స్టార్‌లు విక్రయించేందుకు మారుతీ సుజుకీ ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా మరో లక్ష యూనిట్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారులో 998 సీసీ కే10బీ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ధరలు కిందకి దిగి వస్తాయి: అహ్లువాలియా
సిటీ ఉద్యోగాల కోత ప్రభావం భారత్‌పై పాక్షికమే
ధరలు తగ్గింపునకు పరిశ్రమల విముఖత
మార్కెట్‌‍లో నష్టాలు: సెన్సెక్స్ 354 పాయింట్ల పతనం
కింగ్‌ఫిషర్‌లో వాటాపై విదేశీ సంస్థల ఆసక్తి: మల్యా
సంక్షోభం త్వరలోనే ముగుస్తుంది: చిదంబరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...