|
| సిటీ ఉద్యోగాల కోత ప్రభావం భారత్‌పై పాక్షికమే |
| ముంబయి (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 12:12 IST ) | |
అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం సిటీ గ్రూపు వెల్లడించిన ఉద్యోగాల కోత ప్రభావం భారత్‌పై పాక్షికంగానే ఉండనుంది. ఈ మేరకు సిటీ ఇండియా మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సిటీ గ్రూపు తన బీపీవో విభాగమైన సిటీగ్రూపు గ్లోబల్ సర్వీసెస్‌ను టీసీఎస్‌కు విక్రయించడంతో భారత్‌పై ఉద్యోగాల కోత ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని వివరించింది.
ఇటీవల సిటీ గ్రూపు గ్లోబల్ సర్వీసెస్‌ను టీసీఎస్ 505 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు లావాదేవీలు ప్రస్తుత త్రైమాసికంతో పూర్తికానున్నాయని సిటీ ఇండియా ఈ ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల రంగంపై ప్రధానంగా దృష్టిసారించేందుకు సిటీ గ్రూపు భారత్‌లో బీపీవో కార్యకలాపాల నుంచి బయటకు రావాలని నిర్ణయించుకుంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|