యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
ధరలు తగ్గింపునకు పరిశ్రమల విముఖత
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 09:14 IST )
ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకునేందుకు ధరల తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం చేసిన విజ్ఞప్తిని పరిశ్రమలు తోసిపుచ్చాయి. మంగళవారం భారత ఆర్థిక సదస్సు- 2008లో ఆర్థిక మంత్రి పి.చిదంబరం మాట్లాడుతూ.. ధరలు తగ్గించాలని పరిశ్రమలకు విజ్ఞప్తి చేశారు. అయితే ధరల తగ్గింపు దిశగా స్పష్టమైన హామీ ఇచ్చేందుకు పరిశ్రమలు వెనుకడుగు వేశాయి.

చిదంబరం ప్రతిపాదనపై ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ మాట్లాడుతూ... ధరల తగ్గింపు కంపెనీల వాటాలను బలపరుస్తుందని భావించలేమన్నారు. అంతేకాకుండా డిమాండ్ పెంచేందుకు ధరల తగ్గింపు దోహదపడదని ఆయన పేర్కొన్నారు. ద్విచక్రవాహన పరిశ్రమ 4 నుంచి 5 శాతం వరకే లాభావకాశాలు కలిగివుందన్నారు. సమీప భవిష్యత్‌లో ధరల తగ్గింపును చూడలేమని బజాజ్ విలేకరులతో చెప్పారు.

అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ తదితర రంగాల కంపెనీలకు ధరలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై కార్పొరేట్ కంపెనీలు చీలిపోయాయి. హీరోహోండ్ మోటార్స్ ఛైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ మాట్లాడుతూ.. కనీస వేతనాలు పెరుగుతుండటంతోపాటు, ఇంధన ధరలు, విద్యుత్ ఛార్జీలు కూడా పెరిగిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో తమ ఉత్పత్తుల ధరలను ఎలా తగ్గించగలమని ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ ఛైర్మన్ కేపీ సింగ్ దీనిపై స్పందిస్తూ ధరలు పూర్తిగా మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. ప్రభుత్వమే మొదట చర్యలు తీసుకోవాలని కోరారు. చట్టాల ద్వారా ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. నియంత్రణ వ్యవస్థ, విధానాలతో ప్రభుత్వం మార్కెట్‌లో గృహ కల్పన రంగానికి విస్తృత అవకాశాలు కల్పించాలన్నారు. దీని ద్వారా ధరలు దిగివస్తాయని చెప్పారు.

మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో సమావేశం అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అధ్యక్షుడు కేవీ కామత్ అనేక వస్తువుల ధరలు తగ్గుతాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పిలుపుకు అనేక కంపెనీలు సానుకూలంగా స్పందించాయని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రావత్ తెలిపారు. ధరల తగ్గింపు డిమాండ్ పెంచేందుకు సహాయపడగలదని సెయిల్ ఛైర్మన్ ఆర్‌కే రోంగ్తా పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మార్కెట్‌‍లో నష్టాలు: సెన్సెక్స్ 354 పాయింట్ల పతనం
కింగ్‌ఫిషర్‌లో వాటాపై విదేశీ సంస్థల ఆసక్తి: మల్యా
సంక్షోభం త్వరలోనే ముగుస్తుంది: చిదంబరం
సిటీ గ్రూపులో 52 వేల మంది ఉద్యోగులపై వేటు
చమురు కంపెనీల ఉద్యోగుల సమ్మె వాయిదా
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 94 పాయింట్ల పతనం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...