|
| మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 354 పాయింట్ల పతనం |
| ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 17:34 IST ) | |
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) మంగళవారం నష్టాల బాటలో పయనించింది. అమెరికా మార్కెట్‌ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో 207 పాయింట్ల పతనంతో 9,084 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కూడా నష్టాల్లోనే కొనసాగింది. ఒక దశలో పాక్షికంగా కోలుకొని 9169 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకినప్పటికీ, సెన్సెక్స్ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది.
మంగళవారం సాయంత్రం ముగింపు సమయానికి సెన్సెక్స్ 354 పాయింట్లు పతనమై 8,937 వద్ద స్థిరపడింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా ఈ రోజు నష్టాల్లోనే నడిచింది. నిఫ్టీ ముగింపు సమయానికి 117 పాయింట్లు కోల్పోయి 2683 వద్ద నిలిచింది.
మార్కెట్ లావాదేవీల్లో విప్రో వాటాలు 9 శాతం నష్టపోయాయి. ఎన్టీపీసీ వాటాలు 8 శాతం, ఏసీసీ, టీసీఎస్ వాటాలు 7 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు వాటాలు 6.7 శాతం, భారతీ ఎయిర్‌టెల్ వాటాలు 6.3 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలు 6 శాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ వాటాలు 5 శాతం పతనం అయ్యాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|