|
| సంక్షోభం త్వరలోనే ముగుస్తుంది: చిదంబరం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 13:05 IST ) | |
ప్రస్తుతం నెలకొని ఉన్న ఆర్థిక సంక్షోభానికి త్వరలోనే ముగింపు లభిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం నమ్మకం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఆర్థిక సంక్షోభ పరోక్ష ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది ప్రారంభంలో తిరిగి పుంజుకుంటుందని తెలిపారు.
న్యూఢిల్లీలో జరుగుతున్న భారత ఆర్థిక సదస్సు- 2008లో చిదంబరం మాట్లాడుతూ.. పారిశ్రామిక దేశాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో చిక్కుకోవడం ఇది తొలిసారి కాదన్నారు. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న సంక్షోభం తీవ్రంగా ఉందన్నారు. ఈ సంక్షోభానికి భారత్ కారణం కానప్పటికీ, సంక్షోభ పరిష్కారంలో భాగస్వామి కావాలనుకుంటుందని చెప్పారు.
దేశ వ్యవసాయ రంగం నుంచి బలమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి రేటు సాధించగలదన్నారు. ఈ ఏడాది భారీ దిగుబడులను ఆశిస్తున్నామని చిదంబరం తెలిపారు. ఇదిలా ఉంటే ఉత్పాదక, ఆర్థిక, సేవల రంగాలు ద్రవ్య కొరతను ఎదుర్కొంటున్నాయి. ద్రవ్య లభ్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చిదంబరం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
మొత్తం మీద భారత ఆర్థిక వ్వవస్థ బలంగా ఉందని చెప్పారు. భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు కనీసం 7 శాతం వద్ద ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాలు రెండు శాతానికే పరిమితం అయి ఉన్నాయన్నారు. దీనితో పోలిస్తే భారత్ మూడురెట్లకుపైగా వృద్ధి సాధించగలదని మంత్రి తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|