|
| సిటీ గ్రూపులో 52 వేల మంది ఉద్యోగులపై వేటు |
| న్యూయార్క్ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 12:27 IST ) | |
అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూపు ప్రపంచవ్యాప్తంగా 52 వేల ఉద్యోగాలపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఉద్యోగాల కోత వచ్చే ఏడాది ప్రారంభంలో అమల్లోకి వస్తుందని సిటీ గ్రూపు సోమవారం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు అమెరికా రెండో అతిపెద్ద బ్యాంకు అయిన సిటీ గ్రూపును కూడా తాకాయి. రుణ నష్టాలు నానాటికీ పెరుగుతుండటంతో బ్యాంకు ఆర్థిక పరిస్థితిని సరిచేసేందుకు సిటీ గ్రూపు ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించుకుంది.
సిటీ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విక్రమ్ పండిట్ సోమవారం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మంది ఉద్యోగులతోపాటు, అదనంగా మరో 23 వేల ఉద్యోగాలను తొలగించనున్నట్టు ప్రకటించారు. ఈ తొలగింపు ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి- సెప్టెంబరు నెలల మధ్య కాలంలో జరుగుతుందన్నారు.
బ్యాంకు నిర్వహణ వ్యయాన్ని 20 శాతం మేర తగ్గించాలనుకుంటుందని చెప్పారు. 2009లో బ్యాంకు నిర్వహణపై 50 బిలియన్ డాలర్ల వరకు మాత్రమే ఖర్చు చేయాలనుకుంటుందన్నారు.
గత నాలుగు త్రైమాసికాల్లో బ్యాంకు నిర్వహణా వ్యయం 61.9 బిలియన్ డాలర్ల వద్ద ఉండటం గమనార్హం. తాజాగా ప్రకటించిన ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ, రీటైల్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లతోపాటు అన్ని వ్యాపార విభాగాల్లోనూ ఉంటుందని విక్రమ్ పండిట్ వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|