|
| మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 94 పాయింట్ల పతనం |
| ముంబయి (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 17:53 IST ) | |
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సోమవారం నష్టాల బాటలో పయనించింది. 12 పాయింట్ల వృద్ధితో 9397 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం కాసేపటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. బ్యాంకింగ్, రియాల్టీ రంగాల్లో అమ్మకాలు ఈ పరిణామానికి కారణమయ్యాయి.
ఒకానొక దశలో ఈ రోజు గరిష్ట స్థాయి నుంచి 479 పాయింట్లు పతనమై 8957 పాయింట్లకు పడిపోయిన సూచి, కిందిస్థాయిలో కొనుగోళ్లతో కోలుకుంది. సాయంత్రం ముగింపు సమయానికి సెన్సెక్స్ 94 పాయింట్ల నష్టంతో 9,291 వద్ద స్థిరపడింది. ఇదిలా ఉంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (నిఫ్టీ) కూడా నష్టాల్లోనూ నడిచింది.
నిఫ్టీ ముగింపు సమయానికి 10 పాయింట్లు కోల్పోయి 2800 వద్ద నిలిచింది. మార్కెట్ లావాదేవీల్లో విప్రో, ఏసీసీ వాటాలు 4.5 శాతం లాభపడ్డాయి. టాటా మోటార్స్, మారుతీ, భారతీ ఎయిర్‌టెల్ వాటాలు 2.5 శాతం పుంజుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వాటాలు 7.7 శాతం, టాటా స్టీల్, డీఎల్ఎఫ్ వాటాలు 4 శాతం క్షీణించాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|