|
| తీవ్రవాదం భయాలు వీడండి: కేంద్రం పిలుపు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 17:45 IST ) | |
దేశంలో ప్రధాన వాణిజ్య కేంద్రాలుగా గుర్తింపు పొందిన నగరాల్లో తీవ్రవాద దాడులు జరుగుతుండటంతో భయాందోళనలకు గురైవుతున్న పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ధైర్యాన్ని నూరిపోసే చర్యలు చేపట్టింది. తీవ్రవాద దాడుల విషయంలో భయాలను పక్కనబెట్టాలని పారిశ్రామికవేత్తలను కేంద్రం కోరింది.
ఇటువంటి దాడులు ఆర్థిక అంశాలపై ప్రభావం చూపబోవని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. అహ్మదాబాద్, బెంగుళూరు, హైదరాబాద్ నగరాల్లో ఇటీవల బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.
భారత ఆర్థిక సదస్సు- 2008లో జాతీయ, ప్రాంతీయ భద్రతపై జరిగిన చర్చలో జైస్వాల్ పాల్గొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రవాద దాడులు ప్రభావితం చేయలేవని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నక్సల్స్ సమస్యను అరికట్టేందుకు కేంద్రం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|