|
| ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న జపాన్ |
| టోక్యో (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 17:02 IST ) | |
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సంక్షోభం కోరల్లో చిక్కుకుంది. సోమవారం వెల్లడైన అధికారిక నివేదికలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని తప్పించుకునేందుకు జపాన్ కంపెనీలు మూడో త్రైమాసికంలో పెట్టుబడులు తగ్గించాయి. దీంతో జపాన్ సంక్షోభంలోకి జారుకుంది.
సెప్టంబరుతో ముగిసిన త్రైమాసికంలో జపాన్ ఆర్థిక వ్యవస్థ 0.1 శాతం మేర కుచించుకుపోయింది. అంతకుముందు త్రైమాసికంలోనూ ఆర్థిక వ్యవస్థ 0.9 శాతం మేర పతనం అయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని 0.4 శాతానికి పరిమితం చేస్తూ జపాన్ ప్రభుత్వ తాజా అంచనాలు వెలువడ్డాయి. ఇంతకుముందు వేసిన అంచనాలకు మించి జపాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థలుగా పేరొందిన జి- 8 దేశాల్లో ఇప్పటికే జర్మనీ, ఇటలీ కూడా సంక్షోభం కోరల్లో చిక్కుకున్నాయి. సోమవారం అధికారికంగా జపాన్ కూడా ఈ కోవలో చేరింది. వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ త్రైమాసికాల్లో ఆర్థికాభివృద్ధి తిరోగమన బాటలో ఉంటే ఆ దేశం సంక్షోభంలో చిక్కుకున్నట్టు పరిగణిస్తారు. తాజాగా జపాన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకోవడానికి వ్యాపార పెట్టుబడుల్లో 1.7 శాతం క్షీణత నమోదవడం ప్రధాన కారణమైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|