యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
మరిన్ని చర్యలు తీసుకునేందుకు వెనుకాడం: ప్రధాని
న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008   ( 09:03 IST )
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ఇది చెప్పడానికి తానేమీ జ్యోతిష్కుడిని కానని అన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన జి- 20 సమావేశంలో పాల్గొని తిరిగి వస్తున్న సందర్భంగా ప్రత్యేక విమానంలో ప్రధానమంత్రి విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక సంక్షోభం తీవ్రరూపాన్ని ఇంకా చూడలేదనే అభిప్రాయం వక్తం అవుతోందన్నారు.

దేశంలో ద్రవ్యోల్బణం మరింత దిగివస్తే, ద్రవ్య చెలామణి విషయంలో మరిన్ని దూకుడు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే వడ్డీరేట్లపై తానేమీ మాట్లాడబోనని, దీనికి సంబంధించిన నిర్ణయాలు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌‍బీఐ) పరిధిలో ఉన్నాయని చెప్పారు. వాటిపై తాను మాట్లాడటం సమంజసం కాదన్నారు. పెట్రో ధరలు తగ్గించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ప్రధాని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
విమాన ఇంధనం ధర 12 శాతం తగ్గింపు
రక్షణాత్మక ధోరణిని అనుమతించరాదు: మన్మోహన్
అవుట్‌సోర్సింగ్ సమస్య కాదు: భారత్ విశ్వాసం
ఐక్యరాజ్యసమితి టాస్క్‌ఫోర్స్‌లో వైవీ రెడ్డి
1700 ఉద్యోగాలపై ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ కోత
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో భారత్‌కు లబ్ది
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...