|
| అవుట్‌సోర్సింగ్ సమస్య కాదు: భారత్ విశ్వాసం |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008 ( 15:20 IST ) | |
అమెరికాతో సంబంధాలు కొనసాగించే విషయంలో అవుట్‌సోర్సింగ్ సమస్య కాబోదని భారత్ విశ్వాసం వ్యక్తం చేసింది. త్వరలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న బరాక్ ఒబామా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టపరిచేందుకు కృషి చేస్తుందని పేర్కొంది. ఈ విధంగా అమెరికాలో అధికారంలోకి రానున్న ఒబామా ప్రభుత్వం హామీ ఇచ్చిందని భారత ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్ మోంటెక్ సింగ్ అహ్లువాలియా తెలిపారు.
ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామా ప్రకటించిన అవుట్‌సోర్సింగ్ విధానాలు భారత్‌ను కలవరపెట్టడంపై అహ్లువాలియా మాట్లాడుతూ.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడటానికి అవుట్‌సోర్సింగ్ సమస్య కాబోదని చెప్పారు. బరాక్ ఒబామా ప్రతినిధి, అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మాడెలైన్ ఆల్‌బ్రైట్‌తో సమావేశం అనంతరం అహ్లువాలియా మాట్లాడుతూ ఇరుదేశాల సంబంధాలను పటిష్టపరచడంపై వారు స్పష్టమైన హామీలు ఇచ్చారన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|