|
| అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో భారత్‌కు లబ్ది |
| న్యూయార్క్ (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008 ( 14:19 IST ) | |
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో భారత్‌కు లబ్ది చేకూరుతుందని అమెరికా నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం భారత్‌కు కొత్త అవకాశాలు కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థలు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఉన్నత వేదికలపై శాశ్విత స్థానాన్ని పొందేందుకు భారత్ ఈ సంక్షోభం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అమెరికా విదేశీ వ్యవహారాల మండలికి చెందిన ఉన్నతాధికారి ఆడమ్ సెగల్ మాట్లాడుతూ ఈ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
కొంతకాలం క్రితం నుంచి అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో భారత్ తమకు సముచితమైన స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఈ సంస్థల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే.
భారత్‌పై ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ప్రభావాన్ని విశ్లేషిస్తూ సెగల్ తయారు చేసిన నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలో భారత్ కూడా చిక్కుకున్నప్పటికీ, దాని నుంచి వేగంగా కోలుకునేందుకు భారత్‌కు మార్గాలు ఉన్నాయని చెప్పారు.
ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్ భవిష్యత్ వృద్ధి రేటు కూడా పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు. భారత ఆర్థిక రంగం పటిష్ట పునాదులపై ఉంది. రుపాయి పూర్తి మార్పిడికి వీలులేదు.
అంతేకాకుండా భారత బ్యాంకులకు అమెరికాలోని సబ్‌ప్రైమ్ రుణాలతో పెద్దగా సంబంధాలు లేవు. అయితే స్టాక్ మార్కెట్‌లు మాత్రం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల కారణంగా బాగా దెబ్బతిన్నాయి. స్వదేశీ మార్కెట్‌ల ద్వారా వాటిల్లిన నష్టాలను పూడ్చుకునేందుకు వారు భారత కంపెనీల్లోని 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.
అమెరికా, యూరోపియన్ దేశాల ఆర్థిక సంక్షోభ ప్రభావం పడటానికి దీనితోపాటు అనేక కారణాలు ఉన్నప్పటికీ, సంక్షోభం నుంచి వేగంగా కోలుకునేందుకు భారత్‌కు ఆశావహ పరిస్థితులు ఉన్నాయని సెగల్ చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|