యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
టాటా టెలీకి డొకొమొ రూ.949 కోట్ల ఓపెన్ ఆఫర్
ముంబయి (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 14:19 IST )
జపాన్ టెలికాం సంస్థ ఎన్టీటీ డొకొమొ శుక్రవారం టాటా టెలీసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్ (టీటీఎంఎల్) వాటాదారులకు రూ.949 కోట్ల ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీలో 20 శాతం వాటా చేజిక్కించుకునేందుకు డొకొమొ ప్రతి వాటాకు రూ.24.70 ఇవ్వజూపింది.

టాటా సన్స్‌తో కలసి డొకొమొ ప్రకటించిన ఈ ఓపెన్ ఆఫర్ జనవరి 8న ప్రారంభమై జనవరి 27, 2009తో ముగుస్తుందని టీటీఎంఎల్ శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు తెలియజేసింది. ఈ ఆఫర్ కింద డొకొమొ 38,42,41,919 షేర్లు కొనుగోలు చేయనుంది.

ఇదిలా ఉంటే జపాన్‌లో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎన్టీటీ డొకొమొ టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్ (టీటీఎల్)లో 26 శాతం వాటాను చేజిక్కించుకుంది. ఈ వాటా విలువ 2.7 బిలియన్ డాలర్లు (రూ.13070 కోట్లు). టీటీఎంఎల్‌లో డొకొమొ వాటాల కొనుగోలు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్ఐపీబీ), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులపై ఆధారపడి ఉంటుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మార్కెట్‌లో నష్టాలు: సెన్సెక్స్ 151 పాయింట్ల పతనం
ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించగలం: చిదంబరం
ముమ్మరంగా టాటా స్టీల్ విస్తరణ కార్యక్రమాలు
పది వేల ఉద్యోగాలపై బ్రిటీష్ టెలికామ్ వేటు
ఏడేళ్ల గరిష్ట స్థాయిలో అమెరికా నిరుద్యోగుల సంఖ్య
మరింత తగ్గిన ద్రవ్యోల్బణం: 8.98 శాతంగా నమోదు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...