యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
రికార్డు స్థాయిలో 12.01 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008   ( 20:20 IST )
ద్రవ్యోల్బణం తాజాగా రికార్డు స్థాయిలో 12.01 శాతానికి చేరుకుంది. ద్రవ్యోల్బణానికి ఇది 13 ఏళ్ల గరిష్ట స్థాయి. గుడ్లు, చేపలు, మాంసం తదితర ఆహార పదార్ధాల ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం పైకెగిసింది.

ద్రవ్యోల్బణం జులై 26వ తేదీతో ముగిసిన వారాంతానికి 12.01 శాతానికి చేరుకుంది. రెండంకెల స్థాయి నుంచి ద్రవ్యోల్బణం త్వరలోనే కిందకు వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనాలు వేసింది. అయితే తాజా వారాంతంలో అంతకుముందు వారంతో పోలిస్తే ద్రవ్యోల్బణం 0.3 శాతం పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ద్రవ్యోల్బణం వృద్ధి చెందటం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ ఈ పరిస్థితిపై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

వారం మొత్తంమీద చూస్తే ద్రవ్యోల్బణం స్థిరంగానే ఉందని తెలిపింది. ఇంధన సూచిలో కూడా ఎటువంటి మార్పు లేదని వెల్లడించింది. వంటకు ఉపయోగించే పప్పుధాన్యాలు, సుగంధద్రవ్యాలు, గ్రుడ్లు, చేపలు, మాసం ధరలు పెరగడం ద్రవ్యోల్బణం ఈ స్థాయికి చేరడానికి కారణమయ్యాయని ఆర్థిక శాఖ పేర్కొంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 44 పాయింట్లు వృద్ధి
బీఎండబ్ల్యూ ఇండియా కార్ల విక్రయాల్లో భారీ వృద్ధి
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌కు త్రీజీ లైన్స్
అణు ఇంధన రంగంలో అవకాశాలపై బీఈఎల్ దృష్టి
భారత్‌లో ఆగస్టు 22 నుంచి యాపిల్ ఐఫోన్ అమ్మకాలు
మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 113 పాయింట్ల వృద్ధి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...