|
| అణు ఇంధన రంగంలో అవకాశాలపై బీఈఎల్ దృష్టి |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008 ( 12:03 IST ) | |
అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం విజయవంతంగా అమల్లోకి వస్తుందని భావిస్తున్న భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ (బీఈఎల్) అణు ఇంధన రంగంలో వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టింది. దేశంలో అతిపెద్ద డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కంపెనీ అయిన బీఈఎల్ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న నవరత్నాల్లోనూ ఒకటి.
అణు సాంకేతిక పరిజ్ఞాన రంగంలో పరికరాల తయారీపై దృష్టి పెట్టాలని బీఈఎల్ యోచిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీవీఆర్ శాస్త్రి వెల్లడించారు. అమెరికా- భారత్ పౌర అణు ఒప్పందం ఈ రంగంలో భారీ ఎత్తున సాంకేతిక ప్రయోజనాలకు, పెట్టుబడుల అవకాశాలకు తెరతీయనుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ కంపెనీలు, బీఈఎల్ ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నాయని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|