యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు వాణిజ్య వార్తలు
చమురు సంస్థల కోసం ఎదురుచూస్తున్న నష్టాలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 10 మే 2008   ( 13:56 IST )
ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు దేశంలో చమురు అమ్మకాల ద్వారా వస్తున్న నష్టాలు ఇప్పట్లో వదిలే అవకాశాలు కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు నానాటికీ పెరుగుతుండటం, దిగుమతులపై రూపాయి ప్రభావం తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రూ.1,80,000 కోట్ల ఆదాయ నష్టం పొంచివుంది.

ఇంధన అవసరాలు తీర్చుకునేందుకు భారత్ సుమారు నాలుగింట మూడొంతులు దిగుమతులపైనే ఆధారపడుతుంది. భారత్ అవసరాల్లో 73 శాతాన్ని దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర ప్రస్తుతం 125 డాలర్లకు చేరింది. దీనికి తోడు బలహీన పడుతున్న రూపాయి దిగుమతులపై ప్రభావం చూపుతోంది.

ఈ కారణాలతో ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలో చమురు అమ్మకాల ద్వారా మరింత నష్టపోనున్నాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. మొదట ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 కోట్ల నష్టం రావచ్చని భావించాము. అయితే ముడిచమురు ధర అనూహ్య పెరుగుదల, రూపాయి ప్రభావం కారణంగా ఈ నష్టం రూ.1,80,000 కోట్లకు చేరే అవకాశం ఉంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ధర తగ్గించేందుకే సిమెంట్ దిగుమతి: అశ్విని
అంతర్జాతీయ మార్కెట్‌లో 126 డాలర్లపైకి చేరిన చమురు ధర
మార్కెట్లో నష్టాలు: 16,679 వద్ద ముగిసిన సెన్సెక్స్
అమెరికా డాలర్‌పై బలపడిన రూపాయి
ధరల తగ్గింపుకై సిమెంటు కంపెనీలపై ప్రభుత్వ ఒత్తిడి
మరింత పెరిగిన ద్రవ్యోల్బణం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
క్రేజీ స్టార్ అల్లు అర్జున్, షీలా హీరోహీరోయిన్‌లుగా నటించిన పరుగు చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్...
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
వినోదాన్ని పంచే భలే దొంగలు
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace