|
| వీధి దీపం | |
వీధి మలుపు చివరిలో ఓ మున్సిపాలిటీ దీపం. ఒంటరిగా, ఏకాకిగా తన మసక వెలుతురును విరజిమ్మేందుకు ప్రయత్నిస్తోంది. యవ్వనం, ముసలితనాలు మనిషికే సొంతం కాదు. వీధి దీపానికి సైతం ఉన్నాయి సుమా... అనేలా ఉంది. ఆ వీధి దీపం పరిస్థితి.
దీపాన్ని నిలబెట్టే కాళ్ళ వంటి ఆ స్తంభం కొంత ఒరిగిపోయింది. తల లాంటి అద్దపు కిరీటం ఓ వైపు పగిలిపోయింది. ఆ చిన్నవాడు తన ఆటలో భాగంగా విసిరిన రాయి దీపానికి తెచ్చే కష్టాన్ని తలచాడా? మనసు లేని గాలి అప్పుడప్పుడూ భీకరంగా వీస్తూ దీపాన్ని చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడింపజేస్తోంది. కనీసం మసకబారిన వెలుతురునైనా ఇస్తోందనే విశ్వాసమైనా ఆ గాలికి లేదాయే.
వర్షంలోనైనా దీపం చలిని గురించి అనుకునే నాధుడు లేడాయే. ఇకమీదట ఆ దీపం అటువైపు వద్దు దానిని అక్కడి నుంచి తీసివేయండి.
దేహం వడలిన ఓ ముదుసలి ఆ దీపానికి మిత్రుడు. ఒకే వయస్సు వారికే స్నేహం కుదిరింది. అది సహజమే. అందుకే ముసలివాడికి దీపం, దీపానికి ముసలివాడు తోడు. వీధి దీపం వెలుతురు ముదుసలివాడి మనసుకు నెమ్మదిని చేకూరుస్తుంది. కానీ ఆ దీపాన్ని తొలగించబోతున్నారనే విషయం ముసలివాడికి తెలియదు.
అతనికి ఎలా తెలుస్తుంది మరి! పాపం అతని కడుపుకు కాస్తంత మెతుకును వెత్తుక్కోవాలి కదా. ఆహారం లేకుండా జీవించ గలడా? ఆ రోజు సాయంత్రం వీధి దీపం కనిపించలేదు. గోతి మాత్రమే మిగిలింది. కటిక చీకటి.. చేతి కర్రను ఎవరో గుంజుకుపోయినపుడు గుడ్డివాడి పరిస్థితిలా! ఆ రోజు ముసలి వాడి జీవితం అగమ్యగోచరమైంది.
పగిలిన వీధి దీపమే.. అయితేనేం అతనికి సహాయంగా ఇన్నాళ్ళూ ఉన్నదే కదా.. వెలుతురు లేకపోయినప్పటికీ స్పర్శను చూసి ఆనందించేందుకు కనీసం దిన్నె అయినా లేదే. తర్వాత రోజు ఉదయం ముదుసలివాడు శవమై ఉండడాన్ని అక్కడి వారు చూశారు.
ప్రస్తుతం ఆ స్థానంలో ఓ కొత్త విద్యుత్ దీపం. దానికింద పిల్లలు కొందరు ఉత్సాహంగా ఆటలాడుతూ ఉన్నారు. వారికి పాత దీపం, పోయిన ముసలివాడిపై దిగులెందుకు? ఓకానొక రోజుకి వారు కూడా అలానే అవుతారని వారికి తెలియదా! అయితేనేం వారు తమకేమీ పట్టనట్టు ఆడుతున్నారు. అదంతే .. ఎక్కడైనా అలానే జరుగుతుంది. పాతది రోత, కొత్తది వింత అన్నట్టు, పాతవి పోతుంటే, కొత్తవి వస్తుంటాయి. అదే మనిషి జీవితం.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| వార్తలు - హెచ్‌ఐవీ రోగుల కోసం బ్రిటన్‌లో కొత్త ఔషధం కనిపెట్టారు. రాల్తేగ్రావిర్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఔషధం... |
| |
|
|
|
|
 | | WD |
| | | జెనీలియా | | ''బాయ్స్'' చిత్రంతో వెండితెరకు పరిచయమైన జెనీలియా అనతికాలంలోనే తెలుగు, తమిళం... |
|
| |
|
|
|
|
|
| టాలీవుడ్ - తరుణ్, ఇలియానాలు జంటగా నటిస్తున్న తాజా చిత్రంలో జగపతిబాబు ఓ కీలకమైన పాత్రలో కన్పించనున్నారు. |
| |
|
|
|
|
|
|
|