యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
సిన్నోడి సేథ్యం (మూడో భాగం)
"ఇకపై మీవాడి ఉద్యోగం గురించి దిగులు పడొద్దు. మీవాడికి ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది ఏమంటావ్?"

"మీ మేలు మరిచిపోలేను బాబూ."

"అమ్మా నాన్న పోయాక ఏమీ లేని వాడిగా మిగిలిపోయాను. తర్వాత సంసారబంధంలో పడి, ఆ తర్వాత పిల్లలందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దేంతవరకూ ఆరాటం. ఈ గొడవల్లో నాకు తెలియకుండానే రిటైర్మెంట్ వయస్సు వచ్చేసింది. రెండేళ్ల క్రితం డిప్యూటీ కలెక్టర్‌గా రిటైరైనాను. కాని ఏదో వెలితి. ఇంతలో అనుకోని విధంగా ఇటు వచ్చిన నాకు. పాత స్మృతులన్నీ, తిరిగి ఓ కొత్త స్ఫూర్తినిస్తున్నాయి. ఈ భూముల్ని చూసిన తర్వాత రైతుగా నా శేష జీవితాన్ని ఇక్కడే గడపాలనిపించింది. ఏదో నీలాంటి వాడు తోడుగా నిలిస్తే వ్యవసాయాన్ని ఓ పట్టు పడదామని ఉంది. అందుకే ఈ భూముల్ని ప్లాట్స్ చేయడానికి వీల్లేదని ప్రభాకర్‌కి చెప్పాను. కావాలంటే తనకి ఇప్పటి వరకు అయిన ఖర్చు ఇస్తానని చెప్పాను." ప్రభాకర్ తండ్రి మాటలు సిన్నోడి హృదయంపై పన్నీటి జల్లులు కురిపించాయి.

"తమరిలాంటోళ్ల వల్లనే మన తెలుగుబిడ్డ అన్నపూర్ణమ్మగా కలకాలం వర్ధిల్లుతుంది బాబూ." సిన్నోడి చక్షువులు ఆనందాశ్రువులు పుష్పించాయి.

"ఆ మాట నీకు సరిపోతుంది సిన్నోడా! అన్నట్టు మావాడు టౌన్‌కి వెళ్లాడు. నిన్ననే సిమెంట్‌కి ఆర్డరిచ్చాడట. ప్రస్తుతానికి సిమెంట్ అవసరం లేదని చెప్పిరావడానికి వెళ్లాడు. రేపొద్దున్నే వచ్చావంటే పొలం పనులు మొదలెడదాం మరి." అని చెప్పి కాలువ గట్టు వైపు సాగిపోయాడు ప్రభాకర్ తండ్రి.

ఈ శుభవార్తని తన వాళ్లకి చెప్పేందుకు వడివడిగా ఇంటికి చేరిన సిన్నోడికి పంచలో చిన్నకొడుకు ఎదురొచ్చాడు. వాడి ముఖం వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోతోంది.

"నాన్నోవ్. మన కోడిపెట్ట గుడ్డు పెట్టింది."

సమాప్తం.
(మూలం - వెబ్‌దునియా)
1| 2
 
మరిన్ని...
ప్రేమ పిచ్చోడు
సమయ స్పూర్తి
పొగడ్తల పరమానందం
హలో డాక్టర్
ప్రేమలోతు
మద్యం మత్తు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace