|
| సిన్నోడి సేద్యం (మూడో భాగం) | |
ఏడెకరాల దిబ్బ చేరుకున్న సిన్నోడికి ఎప్పుడూ ఏదో ఒక పనులు చేయిస్తూ ఉండే ప్రభాకర్ కన్పించలేదు. ఇంతలో ఓ పెద్ద మనిషి "ఏమోయ్! వెంకట సుబ్బయ్యా, ఎలా వున్నావ్?" అంటూ పలకరించడంతో సిన్నోడు కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తన అసలు పేరేమిటనేది, తనే మరిచిపోతున్న తరుణంలో "ఈ కొత్త మడిసికి నా పేరెట్టా తెలిసిందబ్బా?!" అని దీర్ఘాలోచనలో పడ్డాడు సిన్నోడు.
"ఓర్నీ నన్నింకా గుర్తు పట్టలా? నేను పరంధామయ్య మేస్టారు గారబ్బాయిని. నలభై ఏళ్ల క్రితం ఈ ఊరి బళ్లో చదువుకుంటూ నీతో పాటూ అల్లరి చిల్లరిగా తిరిగే వాడిని గుర్తుందా? మా నాన్న నిన్ను బడికి ఈడ్చుకు రమ్మని పిల్లలందరినీ పంపిస్తే గొడ్లు తోలుకుని అడవికి పారిపోయావే... అవన్నీ మర్చిపోయావా? సుందరం.... సుందరం.... గుర్తుకు రావడంలే!" ఆ ఆగంతకుని వాక్ప్రవాహం వరదలా సాగిపోతోంది.
సిన్నోడి జ్ఞాపకాల దొంతర్లలో కదలికలు. కాసేపటికి అతని ముఖం విచ్చుకుంది... అవును సుందరంబాబు. పరంధామయ్య మేస్టారు గారబ్బాయి. సెలవు రోజుల్లో తనతో పాటు చెట్లంట, పుట్లంట తిరిగేవాడు. కొన్నాళ్లకు మేస్టారుగారికి బదలాయింపు రావడంతో ఊరు వదలి వెళ్లిపోయారు. ఆ రోజు తను కూడా సుందరాన్ని తాడితోపుకి తీసుకెళ్లి కడుపునిండుగా తాటి ముంజెలు తినిపించినట్లు గుర్తు!
సుందరంబాబు! బాగున్నారండీ"?
"ఓర్నీ చొక్కాల్లో గుండీల్లా మధ్యలో ఈ 'అండీలు' ఎందుకో? అన్నట్టు ప్రభాకర్ మా అబ్బాయే! మావాడు తన బిజినెస్ ఎక్స్‌పాండ్ చేస్తున్నట్లు చెప్తున్నప్పుడు మధ్యలో మన ఊరి పేరు వినబడ్డంతో, ఓ సారి మిమ్మల్నందరినీ చూసినట్టుంటుందని ఇక్కడికొచ్చిన నాకు పెద్ద షాక్! చిన్నప్పుడు మనం ఆడుతూ పాడుతూ తిరిగిన పంట పొలాలన్నింటిని మావాడు ప్లాట్స్‌గా మారుస్తున్నాడు. మన పెద్దోళ్లు 'నల్ల బంగారం' అంటూ మురిసిన ఈ మాగాణి పొలాన్ని ప్లాట్స్ వేయడానికి వీల్లేదని చెప్పాను. నువ్వు కూడా నీ పొలాన్ని అమ్మకానికి పెట్టనని చెప్పావటగా?"
"లేదు బాబూ! నా పొలాన్ని అబ్బాయి గారికే ఎంతోకొంత రేటుకి ఇచ్చేద్దామని వొచ్చాను." ఏదో తప్పు చేసిన వాడిలా తలొంచుకుని చెప్పాడు సిన్నోడు.
"వ్వాట్?!" అరిచినంత పని చేశాడు ప్రభాకర్ తండ్రి..
"అవును బాబూ! మా పెద్దోడి ఉజ్జోగం కోసం.. పొలాన్ని అమ్మేయక తప్పడం లేదు."
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|