యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
అతని నవ్వుని చూసి రెచ్చిపోయిన సిన్నోడు, ఎన్నడూ కొట్టి దున్న కర్రలను ఎడాపెడా బాదడం మొదలెట్టాడు. భీతిల్లిన దున్న కర్రలు ఒక్కసారిగా ఇంటి ముఖం పట్టి పరుగు లంఖించుకున్నాయి. అంతే ఊరు ఊరంతా సిన్నోడిని చూసి పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వుకుంది.

ఎలాగోలా పొలాన్ని పారతో తిరగేసి, వానలు కురిసిన వెంటనే నాటు వేయించాలని కూలి మనుషులని పిలిస్తే, "పొలంలోసరిగా నీళ్లు లేపు. నీ పొలం నాటేసే లోపు మా వేళ్లిరుగుతాయి. గసికలతో నాటడం మా వల్ల గాదు." అని ముఖం మీదే చెప్పేసారు.

చివరికి చేసేది లేక ఇంట్లో వాళ్లందర్నీ పొలంలోకి దింపి 'నాటు' అయిందనిపించాడు. కానీ అంతలోనే బండలు పగిలే బెట్ట తీయడంతో నాటంతా విలవిలలాడుతూ మాడిపోయింది. సిన్నోడి సేద్యం ఊరిజనానికి మంచి కాలక్షేపమయ్యింది.

ఈ లోపు ఇంట్లో వాళ్ల నుంచి కూడా సిన్నోడికి ప్రతిఘటనలు ఎదురైయ్యాయి. "గుదిబండలా తయారైన ఆ ఏడెకరాల దిబ్బతో పాకులాడడం కంటే, ఎంతో కొంతకి ఆ పట్నపోడికే అమ్మేయడం మంచిద"ని ఇన్నేళ్లు తన మాటకి పల్లెత్తు మాట కూడా ఎదురు చెప్పి ఎరుగని భార్య సతాయించడం ప్రారంభించింది.

"ఆ దరిద్రపు పొలం అమ్మి నా ఉద్యోగానికి లంచం కట్టండి సంవత్సరంలో అంతకంటే రెట్టింపు సంపాయిస్తాను" అంటూ పెద్దకొడుకు మరో వైపు నుంచి పోరు ప్రారంభించాడు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా 'ఏడెకరాల దిబ్బ' వైపు నడకసాగించాడు సిన్నోడు.

(తరువాయి భాగంలో ముగింపు)
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సమయ స్పూర్తి
పొగడ్తల పరమానందం
హలో డాక్టర్
ప్రేమలోతు
మద్యం మత్తు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace