|
| సిన్నోడి సేద్యం (రెండో భాగం) | |
మరుసటి రోజు పొలానికెళ్లిన సిన్నోడికి కళ్లు తిరగినంత పనయ్యింది. ఆ పట్నపోడు తను కొన్న పొలాలు చుట్టూ కంచె వేయిస్తున్నాడు. అతను కొన్న పొలాలో నుంచి తన పొలానికి వెళ్లాలంటే అతను పెట్టే గేటే శరణ్యం.
ఏం చేయాలో పాలుపోని సిన్నోడు పరుగుపరుగున వెళ్లి పంచాయతీ ప్రెసిడెంటు దగ్గర మొరపెట్టుకున్నాడు.
"ఒరే సిన్నోడా! నీకెందుకురా అంత పంతం." అంటూ సిన్నోడిని నాలుగు తిట్లు తిట్టి, ప్రభాకర్‌ను పిలిపించి, "ఏంతైనా మా ఊరోడు, కాస్త చూసి చూడనట్టు పోవాలి మరి" అని సర్దిచెప్పి, మనిషి నడిచేంత బాటని ఇప్పించాడు పంచాయితీ ప్రెసిడెంటు.
ఇవాళ కాకపోయినా రేపైనా సిన్నోడు తనకి పొలం అమ్మక తప్పదని గట్టిగా నమ్మిన ప్రభాకర్ మారు మాట్లాడకుండా మనిషి నడిచేందుకు సరిపోయే బాట వదలి చుట్టు ప్రక్కల కంచె వేయించేందుకు ఒప్పుకున్నాడు.
"నా కడుపు కక్కుర్తేందో నాకు తెల్సు. పంతం.. గింతం అంటాడేంది పెసిడెంటు? ఆయనకేం! పదెకరాలు అమ్మినా తొంభై ఎకరాలున్నాయి. నాకేముంది? నేలమన్ను.. పొయ్యిలో బూడిద." మనసులోని మాటల్ని పెదవి దాటనీయకుండా ఇంటికి చేరుకున్నాడు సిన్నోడు.
నాలుగు రోజుల తర్వాత దుక్కి దున్నడానికి దున్న కర్రలను పొలం తోలుకపోయాడు. కానీ, మనిషి మాత్రమే నడిచేందుకు వీలుగా ఉన్న ఆ కంచె బాటలో ముందుకు సాగమని దున్నకర్రలు మొరాయించాయి.
దూరంగా ఈ చోద్యం చూస్తున్న ప్రభాకర్‌కి సిన్నోడు తలకు పొలం అమ్మేరోజు ఎంతో దూరంలో లేదనిపించింది. వెంటనే అతని ముఖంపై ఓ విజయహాసం వెల్లివిరిసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|