|
| సిన్నోడి సేద్యం (రెండో భాగం) | |
"ఓ నాన్నోవ్. వీరన్న బాబాయ్ వచ్చాడు. ఎవుళ్లో కొత్త మడిసి కూడా వొచ్చాడు." అంటూ ఇంట్లోకి ఆదరాబాదరాగా వెళ్లి, ఇంట్లో ఉన్న రెండు ముక్కాలి పీటలు తెచ్చి, వాటిని కండువాతో దులిపి వచ్చిన వాళ్లని ఆసీనులవమని వినయంగా చెప్పాడు సిన్నోడి చిన్నకొడుకు. వచ్చినవాళ్లు అదేమీ పట్టనట్లు నిలబడే మాట్లాడటం ప్రారంభించారు.
"ఏం లేదన్నా. ఈ బాబుగోరు మన పొలాల్లో ఓ మంచి ఊరు కట్టిత్తాడంట. మన డొంకబాటలో తారు రోడ్డు పోపిత్తానని, బస్సు కూడా రప్పిత్తానని సెబుతున్నాడు. ఇంకా ఎన్నో గొప్ప గొప్ప ఇసయాలు సెబుతున్నాడు ఈ బాబు.
మన పొలాల్నేం ఉత్తినే ఎత్తుకుపోవటం లేదులే. ఇక్కడ మారుకేటు రేటుకంటే రెట్టింపిత్తన్నడు. అందుకే మా పొలాలన్నీ ఇచ్చేసినాం. నీ పొలమేమో కంచంలో బువ్వలాగుండే ఆనక నీ ఇట్టం." అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పాడు వీరన్న.
"అయితే పొలాలన్నీ ఊరుగా మార్చేస్తానన్న పట్నపోడు ఈయనే గావాల్న" సిన్నోడు పరిస్థితిని కొంచెం కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
"కాన్వెంటు కూడా పెడ్తున్నామండీ. మీ పిల్లలు చక్కగా నాలుగు ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకుంటారు" సర్దుకుంటూ చెప్పాడు పట్నపోడు అని ఆ ఊరి వాళ్లతో పిలువబడుతోన్న ప్రభాకర్.
"నా పిల్లగోల్లు కాన్వెంటు సదువుని దాటొచ్చాశారయ్యా" అని సిన్నోడు జవాబివ్వటంతో ఇబ్బందిగా కదిలాడు ప్రభాకర్.
" ఏందన్నా! అసలు ఇసయం జెప్పు. నానుడు బేరం ఎందుకు? సారూ.. ఓ వంద రూపాయలు ఇలా పడెయ్యండి." అని ప్రభాకర్ దగ్గుర్నుంచి వందతీసుకుని, "అన్నా! రేటుదేముందిగానీ ముందు ఈ బయానా తీసుకో" అంటూ సిన్నోడి చేతిలో వంద కాగితం పెట్టబోయాడు వీరన్న.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|