|
| సిన్నోడి సేద్యం (మొదటి భాగం) | |
"ఓర్ని కడుపు సల్లంగుండ. ఎంకడి పక్క పొలం గల్లోడివి. నీకే ఈ సంగతి తెలవదంటరా. ఆడెవడో అవిద్రాబాదు నుంచొచ్చాడంట. ఈ పొలాలన్నీ కొని ఇక్కడే ఓ పెద్ద ఊరు కట్టిత్తాడంట. మన రమణయ్య, వీరన్నలు కూడా పొలాల్ని బేరానికి పెట్టారంట. రోడ్డుకు కూసింత దూరాన మీ పొలాలు ఉండటం మీ అద్దుట్టంరా.
ఆ పట్నపోడు పొలాలకి మంచి రేటే బెడ్తన్నాడంట. నువ్వు కూడా ఎంతకాలం ఈ మట్టిలో పొర్లాడతవ్. సుబ్బరంగా పొలాన్ని అమ్మేసి ఆ డబ్బంతా ఫిక్కడులో(ఫిక్స్‌డ్ డిపాజిట్) ఏసి, కాలుమీద కాలేసుకుని నోట్లో ఏలేసుకుని కూకోరాదురా..."
సిన్నోడు చేష్టలుడిగి అలానే నిల్చుండిపోయాడు. "మరి నేను ముర్రగుంట దాకా ఎల్లొత్తారా" అంటూ ఆవైపు సాగిపోయాడు నాయుడమ్మ మావ.
"ఈ ఆయకట్టులో ఎంకయ్య, రమణయ్య, వీరన్నలే మోతుబరి రైతులు. వాళ్లే పొలాల్ని బేరానికి పెట్టిన తర్వాత తన బోటోడు ఎంత మాత్రం. అసలు తన పొలంలోకి నీళ్లొచ్చేదే ఎంకడు పొలం లోంచి. ఇక పొలానికి నీళ్లెట్టా?
ఆ పట్నపోడు ఈ పొలాలన్నీ ఇళ్లు సేసెస్తే, ఆ ఇళ్లమధ్య తనెట్ట ఎగసాయం సేత్తాడు?" ముసురుతున్న ఆలోచనలు మెదడును తొలిచేస్తుంటే, నాలుగంగల్లో నట్టిల్లుకి చేరుకుని కుక్కిమంచంలో కూలబడ్డాడతను.
కాలువకు గండిపడి నీళ్లు పొర్లిపోతున్నట్లు, కాలానికి గండిపడి రోజులు దొర్లిపోతున్నాయి. దుక్కిపని ముగియటంతో ఈ మధ్య సిన్నోడు ఇంటిపట్టునే ఉంటున్నాడు. అలాంటి రోజుల్లో ఓ రోజు సిన్నోడు పంచముందు కూర్చుని తాటి నారతో చేంతాడు పేనుతూ, తన రెండో కొడుకుని దున్న కుర్రలకు కుడితి పెట్టమని పురమాయించాడు.
దున్నకుర్రలకు కుడితిపెట్టి, పలుపు తాళ్లతో కట్టుకొయ్యలకు కట్టేసి గడ్డివామిలోంచి ఓ మోపెడు ఎండుగడ్డి తెచ్చి వాటి ముందు పడేసిన సిన్నోడి చిన్న కొడుక్కి వాకిట్లో వీరన్నతో పాటు ఓ కొత్త మనిషి రావటం కనిపించింది. ఆ కొత్త మనిషి చూడటానికి హూందాగా, దర్జాగా ఉన్నాడు. - (రెండో భాగం వచ్చే వారం)
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|