|
| సిన్నోడి సేద్యం (మొదటి భాగం) | |
ఇక తన హయాం వచ్చేసరికి మూడు సెంట్ల ఇళ్లచోటు, ఇప్పటికీ అందరితో ఏడెకరాల దిబ్బ అని పిలువబడే ఎకరం ముప్పాతిక తప్ప ఏం మిగలలేదు. ఈ ఎకరం ముప్పాతికలోనే తాను రేయింబవళ్లు దొర్లుతూ పొయ్యిలో పిల్లి పడుకునే అవసరం లేకుండా చేస్తున్నాడు.
పేగు మాడకుండా పొలం కాపాడినా, పిల్లల చదువులకోసం ఇతరుల పొలాల్లోకి కూలికి నాలికి వెళ్లక తప్పిందికాదు. ఎలాగైతేనేం పెద్దోడు డిగ్రీ పాసయ్యాననిపించాడు. చిన్న కొడుకు ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని 'గంతకు దగ్గ బొంత' అంటూ తన స్థాయికి తగ్గ సంబంధాన్ని చూసి పెళ్లి కానించేశాడు.
"యాందిరా సిన్నోడా మెలుకునే దున్నుతున్నావా? పాము మెలికల్లా ఆ నాగటి సాలేందిరా?" సింహ గర్జన లాంటి నాయుడమ్మ మావ అదిలింపుతో ఇహలోకంలోకి వచ్చిపడ్డాడు సిన్నోడు. నాయుడమ్మ మావ కూడా తనలాగే బతికిచెడ్డ రైతే.
అవసరానికి ఆపద్భాంధవుడిలా ఆదుకునే నాయుడమ్మ మావ అంటే ఆ ఊరిలో అందరికి భక్తి ప్రపత్తులే. "యాంది మావా ఏలగాని యాల ఇట్టా బైదెల్లినావ్?" సిన్నోడు నాగటి మేడిని పైకెత్తి చెర్నకోలుతో బయటికి తోశాడు.
"ఆ! మా ముర్రగుంట పొలాన్ని ఓపాలి చూసొద్దామని... అవున్రోరా. నీకీ సంగతి తెలుసా..?" సిన్నోడివైపు చూస్తూ అడిగాడు నాయుడమ్మ మావ. "ఏ సంగతి మావా?" "ఎంకడు పొలం అమ్మేశాడంటగా?" "యాంది మావా?!" సిన్నోడు ఒక్కసారిగా దున్నల పగ్గాలను గట్టిగా లాగిపట్టి ఆశ్చర్యంతో నోరు తెరిచాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|