యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
తాటిబుర్ర, మెడకి బరువుగా తగలడంతో బ్యాలన్స్ చాలని కోడి పెట్ట వెనక్కెనక్కి పరుగులు తీయడం ప్రారంభించింది. "ఇహ పొదుగు పొదుగెహె!" అని కోడి పెట్టని రెండు గజాల దూరం వరకు తరిమి కొట్టి, చూరలోనున్న చెర్నకోలని భుజంపై వేసుకుని పంచ దాటిన సిన్నోడిని చూసిన దున్నకుర్రలు, ఒక్కసారిగా పంటకాలువలోకి కొత్త నీరు దూకినట్లు పరుగు లంఘించుకున్నాయి.

కాసేపట్లో ఏడెకరాల దిబ్బను చేరుకున్న సిన్నోడు నాగలి కట్టి, "హర్ర్‌‌ర్ర్...ఛోఛో" అంటూ దున్నల్ని అదిలించసాగాడు. నాగటి సాళ్లలోంచి బయట పడిన పురుగుల కోసం గోరింకలు, పాలపిట్టలు గుంపులు గుంపులుగా వచ్చి వాలాయి. గోరింకల్ని చూడగానే సిన్నోడి మనసు నలభై ఏళ్లు వెనక్కు వెళ్ళింది.

అతడు యాంత్రికంగా దున్నల వెంట నడుస్తూ అదిలిస్తున్నాడన్న మాటే గాని... బాగా ముగ్గిన తాటి పండు నేల మీద దప్పున పడ్డట్టు, అతని మనసు ఒక్కసారిగా గతంలోకి దూకేసింది.తనకిప్పటికీ గుర్తే! తన చిన్నప్పుడు ఈ ఏడెకరాల దిబ్బంతా తమ కిందే వుండేది. ఆ రోజుల్లో పంట కాలువ లేదు.

వానలు మొదలవుతాయనగా, ఏడెకరాల దిబ్బంతా పది నాగళ్లను పెట్టించి దున్నించే వాడు తాత. ఆ తర్వాత జడి వానలు కురవడంతో గడ్డి అంతా మురిగి, చేను మంచి పదునుకొచ్చేది. అదను చూసి మరో సారి చేనుని దున్నించడం జరిగేది. అప్పుడే గుంపులు గుంపులుగా గోరింకలు, పాల పిట్టలు వచ్చి వాలేవి.

పోలేరమ్మను తలుచుకుని పాదుల్లో సరివి మొక్కలు నాటించేవాడు తాత. నాలుగో ఏడు తిరిగొచ్చేసరికి నవనవలాడుతూ తోట కోతకొచ్చేది. ఈ లోపు గుంటూరు నుంచి బ్రోకర్లపై బ్రోకర్లు బేరాలకొచ్చి పడేవాళ్లు. అలా చేర్చిన డబ్బుతోనే ఏడెకరాలను 12 ఎకరాలు చేసి పైకి పోయాడు ఆ ముసలాయన.

తాత పోయిన తర్వాత అయ్య హయాంలోకి వచ్చింది పొలం. కల్లు సారాలతోటిదే లోకం అంటూ 12 ఎకరాలను ఎకరం ముప్పాతికగా కుదించి దొంగసారాను దొంగతనంగా తాగి కైలాసం చేరుకున్నాడాయన.
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
పొగడ్తల పరమానందం
హలో డాక్టర్
ప్రేమలోతు
మద్యం మత్తు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace