|
| సిన్నోడి సేద్యం (మొదటి భాగం) | |
తొలకరి జల్లులు మొదలయ్యాయి. నిన్నటి వరకు వడగాల్పులకు ఎక్కడికో పారిపోయిన పచ్చదనం మళ్లీ అక్కడక్కడ తొంగి చూస్తోంది. "ఇయ్యాల్నించి అరక కట్టాల. ఈ వానలకు గాబుగడ్డి మోసులు పెట్టిందంటే, ఆనక దాన్ని అడ్డుకోవడం మాలావు కట్టం" అని ఆలోచిస్తూనే బక్క చిక్కిన దున్నకుర్రలకు కుడితి పెట్టాడు సిన్నోడు.
సిన్నోడంటే నిజంగా "చిన్నోడు" కాదు. అతని వయసు యాభైకి పైమాటే! వాళ్ల నాన్న వెంక సుబ్బయ్య అని పెట్టిన పేరుని, వాళ్లమ్మ సిన్నోడా అని ముద్దుగా పిలిచిన పేరు మింగేసి నాలుగు పుష్కరాలు దాటింది. ప్రస్తుతం సిన్నోడిని ఎవరైనా "వెంకట సుబ్బయ్యా" అని పిలిస్తే, వాళ్లు తన వెనుక ఎవరినైనా పిలుస్తున్నారా.... అని గబుక్కున తిరుగుతాడు.
ఎప్పుడూ మోకాళ్లపైకి కట్టిన పంచెకట్టు, వల్లెవాటు వేసుకున్న ముతక కండువా, గుబురు మీస కట్టుతో కనబడే సిన్నోడు, చొక్కా తొడిగితే చోద్యమే మరి! దున్న కర్రల మెడపై కాడి ఆనించి మెడ చుట్టూ పట్టెడలను బిగించాడతను. కాడిపై నాగటిదుంప తిప్పేసి ,చెర్నకోలకోసం ఇంట్లోకి అడుగుపెట్టిన సిన్నోడి కంట్లో, మూలనున్న గంపపక్క కుదురుగా కూర్చుని పొదుగుతున్న కోడిపెట్ట పడింది.
"ఓయమ్మే పెట్ట మెళ్లో బుర్ర టొక్కు కట్టమని ఎన్నాళ్లయింది నీకు జెప్పి?" అంటూ ఇంట్లో తైదులు విసురుతున్న పెళ్లాంపై విసురుకుని , గంప పక్క కోడిపెట్ట కాళ్లు ఒడిసిపట్టి లాగాడతను. అసలే పొదుగు కొచ్చిన కోడి పెట్ట, ఒళ్లంతా గంపెడు చేసి కేర్...కేర్ మని అరవడం ప్రారంభించింది.
"దీనెవ్వ కారుకి రెండు గుడ్లు పెట్టిందంటే చాలు. రెన్నెళ్లు మూలకూకోని పొదిగిద్ది." తనకి తానే చెప్పుకుంటూ తేగల పాతర దగ్గర ఎండిపోయిన తాటి బుర్రని వెదకి పట్టి నులకతాడుతో కోడిపెట్ట మెడలో బిగించాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|