యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
సర్వేజనా సుఖినోభవంతు-1
అవమానం జరిగిందంటూ ఢిల్లీదాకా వినబడేట్లు కేకలేసాను. జనం నా 'నిజాయితీ'కి బ్రహ్మరథం పట్టారు. విధిలేక అధిష్టాన వర్గం నాకు మంత్రి పదవి కట్టబెట్టే దాకా నేను నోరుముయ్యలేదు.

ఇప్పటికీ మన రాష్ట్రంలో నా అంత నిజాయితీ పరుడైన మంత్రిగా ఎవరూ పేరు తెచ్చుకోలేదన్న విషయం మీకు తెల్సిందే!

ఆ విధంగా మా పార్టీలో వ్యతిరేక వర్గం నాపై పన్నిన 'సూట్‌కేసుల ట్రిక్కు' నాకే అనుకూలించింది.

పోయినసారి ఎన్నికల నుంచి నేను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నాను. ఇప్పుడు మా అబ్బాయి 'మంత్రి' గా 'దేశసేవ' చేస్తున్నాడు.

ఏదైమైనా, తగ్గ సమయంలో సూట్‌కేసులను దొంగిలించి నన్ను గట్టెక్కించిన రాములయ్య గారూ... మీకు శతకోటి వందనాలు.

ఆయన సూట్‌కేసు పారేశాడే అనుకోండి. బుద్ధిగా పోలీస్ స్టేషన్‌కి అప్పగించకుండా మరలా నన్ను గట్టు మీద నుంచి తోసెయ్యకుండా కాపాడిన వెంకటపతి గారూ... మీకూ అనంతకోటి వందనాలు.

అయినా మనలో మనమాట!

ఇలాంటి విషయాలను పబ్లిక్ పార్కులో ఇంత పబ్లిగ్గా మాట్లాడుకోవచ్చా? మీకు ఇంత వయసొచ్చిన తర్వాత కూడా మాత్రం 'ఇంకితం' లేకపోతే ఎలాగయ్యా? పొరపాట్న నా బదులు ఎవడైనా ఇటుగా వచ్చి, ఈ విషయాలన్నీ విని తీగ లాగితే మీ డొంకతో పాటూ నా డొంకంతా కదలదూ?! నేను గాబట్టి సరిపోయింది గానీ..."

శేషాచలం మాటలతో ఊపిరొచ్చిన వెంకటపతి, రాములయ్యలు " అదేనండీ... విధిలీల అంటే..." అంటూ సమిష్టిగా ఆశ్చర్యపోయారు.

ఎందుకో ఆ ముగ్గురూ ఒక్క క్షణం మౌనం తర్వాత పార్క్ అంతా ప్రతిధ్వనించేటట్లు పెద్ద పెట్టున నవ్వుతూ ముక్త కంఠంతో చెప్పిన మాట " సర్వేజనా సుఖినోభవంతు ".

ఏదో పని (!?) మీద అటుగా వచ్చిన ఓ బక్క భారతీయుడు ఆ ముగ్గురు పెద్ద మనుషులు 'సర్వేజనా సుఖినోభవంతు' అని కోరుకోవడాన్ని విని, అప్పటికప్పుడే పరమానందభరితుడై పోవడమే కాక, 'ఊరికి ఇద్దరు ముగ్గురు చొప్పున ఇలాంటి వాళ్ళు వుండబట్టే ఈ కలియుగంలోను ధర్మదేవత ఒక్క పాదం మీదైనా నడుస్తోంది' అనుకుంటూ మురిసిపోయాడు.

పాపం.. ఆ పిచ్చి భారతీయుడు జీవితంలో ధర్మదేవతని ఒక్కసారైనా చూస్తేగా... అసలు విషయం తెలియడానికి!!
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4| 5| 6| 7
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
సమయ స్పూర్తి
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace