|
| సర్వేజనా సుఖినోభవంతు-2 | |
" ఓర్నీ... మీ దుంపల్దెగ. మీ ఇద్దరి కథ విన్న తర్వాత విధి ఇంకా విచిత్రమైందని నా కనిపిస్తుంది. " తమ వెనుకనున్న పొదలవైపు నుంచి వచ్చిన మాటల్ని విన్న రాములయ్యకి, వెంకటపతికి చెమట్లు పట్టాయి. మాటల కంటే, ఆ మాటలన్న వ్యక్తి పొదలనుంచి బయటపడింతర్వాత చూసి జడుసుకున్నంత పనయ్యింది ఆ ఇద్దరికీ.
తాము ఇందాకట్నుంచి మాట్లాడుకుంటున్న రెండు సూట్ కేసుల యజమాని...యం.యల్.ఎ. శేషాచలం!!
సాధారణంగా పార్కులో ఓ చివరగా విసిరేసినట్లుగా వుండే తమ బెంచీ దరిదాపులకు కనీసం నాలుగు కాళ్ల జంతువైనా రావడానికి బద్ధకిస్తుంది. అందుకే తాము ఎలాంటి అరమరికలు లేకుండా రహస్యాలను బహిరంగంగా మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. ఉన్నట్లుండి ఎక్కడో ఉండాల్సిన ఈ మాజీ యం.యల్.ఎ కమ్ మంత్రి ఇక్కడ ప్రత్యక్షం కావడమేమిటి?
" విధి వైపరీత్యం అంటే ఇదేనా ?! "
" ఏమో?? "
ఏ విషయం అర్థం కాక స్థానువుల్లా నిలబడిన వెంకటపతి రాములయ్యలను చూసిన శేషాచలం,
" విధి అంటే ఇదేనయ్యా. ఎక్కడో ఉన్న నేను నా కూతురు ఇంటికి చుట్టపు చూపుగా ఈ ఊరికి వచ్చి... అలా గాలి కోసం ఈ పార్కుకు రావడమేమిటి? గంటన్నర నుంచి పార్క్ ఎంట్రన్స్‌లో కూర్చున్న నేను, ఒకటికొస్తే- పోదామని ఈ పొదల మాటుకి రావడమేమిటి? పనిలో పనిగా మీ మాటలు వినడం ఏమిటి? అంతా విచిత్రంగా లేదూ? " అంటూ దీర్ఘం తీసాడు.
వెంకటపతి, రాములయ్యలకు వెన్నులోంచి చలిపుట్టుకు వస్తే ఎలా ఉంటుందనే విషయం అర్ధం కాసాగింది.
" అదేంటయ్యా.. అలా నిలబడిపోయారు? కూర్చోండి. " శేషాచలం ఆజ్ఞని మౌనంగా పాటిస్తూ సిమెంట్ బెంచీపై మెల్లగా ఆశీనులయ్యారు వెంకటపతి, రాములయ్యలు.
" ఇన్నేళ్లకి నా సూట్‌కేసుల విషయం తెలిసినందుకు సంతోషంగా వుందయ్యా." అని ఛివాల్న లేచిన శేషాచలం, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను నిశితంగా పరిశీలించి ఎవరూ లేరని నిర్దారించుకున్న తర్వాత మరలా సూఖాసీనుడై తగ్గుస్వరంతో చెప్పసాగాడు.
" ఆ రోజి ఒకపని చేయించడానికి గాను, ఓ కాంట్రాక్టరు దగ్గర్నుంచి తీసుకున్న లంచమే ఆ రెండు సూట్‌కేసులు. ఆ దొంగ నాయాలు... నాకు లంచం ఇచ్చినట్లుగానే ఇచ్చి, నాపై కంప్లైంట్ ఇచ్చాడు. విషయం నాకు ఏం తెలుస్తుంది? అమాయకంగా సూట్‌కేసులను తీసుకుని ఇంటికి వచ్చేసరికి రాత్రి పన్నెండున్నర దాటింది. సూట్‌కేసులను బీరువాలో పెట్టి పడుకుందామనుకునేంతలో 'డోర్‌బెల్' మోగింది. నా భార్య వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా అధికారులతో పాటూ అటెన్షన్లో నిలబడ్డ పోలీసులు!!
ఆ సీను చూసిన నా ప్రాణం పోయిందంటే నమ్మండి. ఏం చేయాలో పాలు పోలేదు. ఆ అధికారులను అడ్డుకోడానికి ఏమో సాకులు చెప్పినట్లు గుర్తు! కానీ, వాళ్ళు నన్ను లెక్క చేస్తేగా. చివరగా వాళ్ళు నా బెడ్రూంలోకి అడుగుపెట్టారు. అయిపోయాననుకున్నాను.
కానీ విచిత్రం!!
అక్కడ రెండు సూట్‌కేసుల జాడైనా లేదు.
నన్ను నేను గిల్లి చూసుకున్నాను. ఊహూ.. సూట్‌కేసులు లేవు.
అంతే!!
రెచ్చిపోయానంటే నమ్మండి.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|