|
| సర్వేజనా సుఖినోభవంతు-2 | |
" నా గుండే ఒక్కసారిగా గుభేలు మంది. మతి పోయినంత పనై పోయిందనుకో. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. గభాల్న సూట్ కేస్ మూసి మెల్లగా తిరుగుముఖం పట్టాను. కొద్ది దూరం నడిచానో లేదో నా బుర్రలో పురుగు దొలవడం ప్రారంభమైంది. నగలన్నీ నాకే సొంతమైతే ఎంత బాగుంటుందోనని అన్పించింది. సూట్ కేసుని తీసుకెళ్లి స్టేషన్లో అప్పగిస్తే ఏదో చిన్న క్యాష్ అవార్డ్... మహా అయితే ప్రమోషన్ రావచ్చు. ఆ వచ్చే ప్రమోషన్ మెల్లగా రాకపోదు. ఎంత ప్రమోషన్ మెల్లగా రాకపోదు. ఎంత ప్రమోషన్ వచ్చి జీవితాంతం లంచాలు తీసుకుని సంపాయించినా చచ్చిపోయే లోపల అంత బంగారాన్ని నేను ఎలాగా సంపాయించలేననిపించింది.
అంతే!!
ఇంకొక మాట లేకుండా సూట్ కేసుని గుర్తుగా ఓ మర్రి చెట్టు మొదలు దగ్గర పాతిపెట్టి. కాళ్లీడ్చుకుంటూ సూపర్ గోడౌను దగ్గరకు చేరాను. అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్న ఫోర్ నాట్టూ, " ఆ నా కొడుకు మనకెక్కడ దొరకుతాడన్నా? రేప్పొద్దున లబోదిబోమంటూ ఎవడొస్తాడో...పద...అయినా నిన్నెవడూ వాడెంట అంత దూరం పరుగెత్తమనింది? " అని ఫోర్ నాట్టూ మాట్లాడుతున్నా మా గుండె గుబగుబలాడతానే ఉంది. తెల్లారి వాడు ఈ సంగతి ఎస్సైకి చెప్పాడు.
ఆ యస్సైగాడు, " ఏం వెంకటపతి... దొంగ దగ్గర సూట్ కేసులు కొట్టి ఎక్కడైనా దాచిపెట్టి వచ్చావా ఏమిటి? " అని పరాచికాలాడాడు. యస్సై ఊరకే పరాచికాలాడినా నాకొక రకంగా అయిపోయింది. మరుదినం రాత్రి ఆ మర్రి చెట్టు దగ్గర్నుంచి సూట్ కేసును తీసుకుని తెల్లారికంతా మా అత్తారింటికి చేరేశాడు.
మా అత్త గారు కూడా వాళ్ల ఒక్కగానొక్క కూతుర్మి ... అదే మా ఆడోళ్లని... ఇరవై ఏళ్లు భద్రంగా సాకి నా చేతిలో పెట్టినట్టుగా...ఆ బంగారపు నగలని జాగ్రత్తగా దాచి పెట్టారనుకో... అందుకే రిటైరయ్యింతర్వాత మా అత్తగారి ఊరైన ఈ ఊర్లోనే సెటిలయ్యా."
" మరైతే ఆ తెల్లారి సొమ్ము పోయిందంటూ ఒక్కడు కూడా కంప్లైంటూ చెయ్యలేదా? " వెంకటపతి మాటలకు అడ్డు తగులుతూ అడిగాడు రాములయ్య.
" ఆ తెల్లారేంటి? అది జరిగి ఇరవైయేళ్లు అవుతున్నా... ఇంతవరకు దాని గురించి ఒక్క కంప్లైంట్ వస్తే ఒట్టు పెట్టు. "
" నాకు భలే ఆశ్చర్యంగా ఉంది వెంకటపతి. "
" ఏంటి? ఆ నగల్ని రిటైరయ్యే దాకా దాచిపెట్టి. ఆ తర్వాత బయటకు తీసి వ్యాపారం చేసి సంపాయించానని నలుగురి చేత నమ్మించగలిగేననా? !" నెరసిన బుర్ర మీసాలను సవరించుకుంటూ అన్నాడు వెంకటపతి.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|