|
| సర్వేజనా సుఖినోభవంతు-1 | |
" ఈ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు ఉంటుందంటారు?"
" మొత్తానికి మనవాళ్లు అణు బాంబు పేల్చి భలే పని చేసారండీ"
"కండోమ్ వాడితే నిజంగా ఎయిడ్స్ రాదంటావా?"
" ఈ సంవత్సరం కూడా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయితే బాగుంటుంది బాసూ "
"మొన్న మన వాళ్లు ఏం ఆడారు గురూ! సచిన్ అదరగొట్టాడు !! "
" ఈ అమెరికా వాడి ఆంక్షలేమిటండీ బాబూ ? "
" తనకి నేనంటే ఇష్టమేనని నా అనుమానంరా. కానీ లవ్ లెటర్ ఇద్దామంటే భయంగా ఉంది. " - ఇలా సవాలక్ష ప్రశ్నలకు జవాబులతో కోలాహలంగా ఆ పార్కులో ఓ మూలనున్న సిమెంట్ బెంచీ రెస్ట్‌పై తాపీగా నడుముని ఆనించిన రాములయ్య " ఈ మధ్య మనుషులకు పీక్కు చచ్చేంత ఆశలు పుడుతున్నాయి వెంకటపతి. " అంటూ ఆవేల్టి చర్చకి నాంది వాచకం పలికాడు.
" మనిషై పుట్టింతర్వాత ఆశలను మనసుకి అంటించుకోక తప్పదు. అసలు ఆశ లేనిదే అభివృద్ధి లేదు తెలుసా" రాములయ్య నాందికి ప్రస్తావన పలికాడు వెంకటపతి.
" నిజమేననుకో. కానీ దానికీ ఓ హద్దు- పద్దూ ఉండక్కర్లా? " ఎక్కడో ఈ మూలనున్న నేను ఉన్న ఫలాన ప్రధానమంత్రి కావాలనుకుంటే అది అయ్యే పనా. "
" ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి కావడం పెద్ద విశేషంగా కనబడటం లేదుగానీ...ఇంతకీ అసలు విషయమేంటో చెప్పు"
" ఆ( ఏం లేదు. పోయిన వారం మా చుట్టూల ఊరికి వెళ్లానా " అదేదో ' ఈజీ మనీ స్కీం' అంట. ఆ ఊరంతా ఆ పిచ్చిలో కొట్టుకు పోతుందనుకో. "
" ఈజీ మనీయా... ఇదేదో వింటానికి బాగానే ఉంది రాములూ" వెంకటపతి లేనిపోని ఉత్సుకతతో ముందుకు ఒరిగి కూర్చున్నాడు.
" చెప్తా విను. ముందుగా మనం 11,200 రూపాయలు కడితే నాలుగు కూపన్లు ఇస్తారంట ఇందులో 900 రూపాయలు కంపెనీ ఖర్చులకు, 300 రూపాయలకు ఇతర ఖర్చులకు పోగా, మిగతా పది వేల రూపాయలను ఆరుగురు సీనియర్ సభ్యులకు సమానంగా పంచి, వారి పేరన డీడీ తీసి పంపాలంట.
తర్వాత మనకు ఇచ్చిన నాలుగు కూపన్లను అమ్మితే మన డబ్బులు మనకు తిరిగి వచ్చినట్లే. ఆ నలుగురూ తమ కిచ్చిన తలా నాలుగు కూపన్లను అమ్మితే అందులో నుంచి మనకు కొంచెం కమిషన్ వస్తుందంట. ఆ విధంగా మనం ఆరవ స్టేజీకి చేరితే 4096 మంది నుంచి మనకి రూ.19691200 రూపాయల డీడీల వర్షం కురుస్తుందంట. దాదాపు రెండు కోట్ల రూపాయలు."
" వార్నీ...భలే గొప్ప స్కీంలాగా వుందే?! " ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాడు వెంకటపతి.
" గొప్ప స్కీమే. మా చుట్టం నాలుగు సంవత్సరాల క్రితం పదకొండు వేలు కడితే ఇంతవరకు ఒక్క డి.డి. కూడా రాలేదంట. అంతా మోసం...దగా..."
"ఇలాంటివన్నీ వేస్ట్ రాములూ... తంతే బూరెల బుట్టలో పడ్డట్లు ఏదో ఒక రకంగా జాక్‌పాట్ తగలాలి గానీ..."
" అసలు బూరెల బుట్ట అంటూ ఒకటి దొరకాలి కదా ? "
" మనకని రాసిపెట్టి వుంటే అదే దొరుకుతుంది గానీ..." అంటూ గత పదేళ్లుగా ఎన్నో రహస్యాలు పంచుకున్న రాములయ్యకి, దాదాపు ఇరవైఏళ్ల క్రితం తాను ఎలా బూరెల బుట్టలో పడ్డానన్న సంగతిని ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పడం ప్రారంభించాడు వెంకటపతి.
" 1978లో ఒకరోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? " అంటూ ఆగిన వెంకటపతిని, " కొంపదీసి ఆ రోజు రాత్రే బూరెల బుట్టలో పడ్డావా ఎమిటి? " ఉత్సుకతతో ప్రశ్నించాడు రాములయ్య.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|