|
| సర్వేజనా సుఖినోభవంతు-1 | | - యిమ్మడిశెట్టి కోటేశ్వర్రావ్ |
|
రచయిత పరిచయం - గుంటూరు జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరులో జన్మించిన యిమ్మడిశెట్టి కోటేశ్వరరావు కాలేజీ స్థాయి నుంచే రచనల పట్ల అత్యంత ఆసక్తిని కనబరిచేవారు. తెలుగు ఆధ్యాత్మిక పత్రికా ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన కుముదం భక్తి స్పెషల్‌కు ప్రస్తుతం సంపాదకులుగా పని చేస్తున్నారు. అంతకు ముందు శ్రీ కోటేశ్వరరావు సినీ దర్శకత్వ శాఖలో పనిచేశారు. పలు టెలీసీరియల్ రచనలను హైదరాబాదు దూరదర్శన్‌కి అందించారు. ఇంకా ఆయన రాసిన కథలు, కథానికలు, కథనాలు ఈనాడు, స్వాతి, వనిత వంటి ప్రసిద్ధ పత్రికలలో ముద్రణకు నోచుకున్నాయి. చిరునామా- ఐ.కోటేశ్వరరావు, నెం.19, జాన్‌వాసు స్ట్రీట్ ఎక్స్‌టెన్షన్, మాధవరం మిల్క్ కాలనీ, చెన్నై-51, ఫోన్: 9884448097, ఆఫీస్: 9940109619
ఎప్పటిలానే ఈవెనింగ్ వాక్‌కి బయలుదేరిన వెంకటపతి, రాములయ్యలు - ఎప్పటిలానే దేశకాల పరిస్థితులను గురించి చర్చించుకునేందుకు గాంధీ పార్కులోని సిమెంటు బెంచీపై ఆసీనులయ్యారు. పేరుకి అది 'గాంధీ పార్కు' అయినప్పటికీ అక్కడక్కడా లిక్కర్ బాటిల్స్ దర్శనమిస్తుంటాయి కాబట్టి అది 'బ్రాందీ పార్కు' గానే ప్రసిద్ధం!
వెంకటపతి హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరై, భారత దేశంలోని కొంత మంది ప్రభుత్వోద్యోగుల బాణీలో ఆదాయానికి మించి ఆస్తులను సంపాయించి, ఇద్దరు కూతుళ్లనూ అదే జాబితాకి చెందిన ఇంటి కోడళ్లుగా పంపించి, కొడుకుని డొనేషన్‌తో డాక్టర్ చదివించి, మరలా తన జాబితాకే చెందిన ఓ ఇంటి పిల్లని కోడలుగా తెచ్చుకున్న గట్టి పిండం! ఇక, పూర్వాశ్రమంలో ఏం చేసేవాడో ఎవరికీ తెలియని, నాలుగైదు షాపింగ్ కాంప్లెక్సులకు ఓనరైన రాములయ్య, ఉన్న ఒక్కగానొక్క కొడుకుని తన స్థాయికి మించిన ఇంటల్లుడ్ని చేసిన గడుసు పిండం!!
వెంకటపతి, రాములయ్యలు ' ఒరేయ్...అరేయ్' అని పిలుచుకోకపోయినా వారి మధ్య దాదాపు అంతటి చనువు ఉంది. ఇద్దరూ నడచి వచ్చినపుడు కలిగిన ఆయాసాన్ని కాస్త శాంతింపజేకే యత్నంలో ఉండగా, ఏదో కోటానుకోట్ల కుంభకోణంలో ఇరుక్కుని అరెస్ట్ తప్పదని తెలుసుకున్న తర్వాత ముందస్తు బెయిల్ కోసం కోర్టుకేసి పరుగులు తీసినట్లు- సూర్యుడు హడావుడిగా పశ్చిమాద్రిలో కనుమరుగై పోయాడు. గవర్నమెంటాఫీసుల్లో సీలింగు ఫ్యానులకు చుట్టుకున్న నల్లటి మసిలా, చీకటి మెల్లమెల్లగా నేలపై విశాలంగా పరచుకుని వున్న ఆకాశపు సీలింగుని అలముకుంటోంది.
'ఈవెనింగ్ వాక్' అనే ఒకే సాకుతో ఇంట్లోంచి బయటపడ్డ మగదినం తీరుబడిగా పార్కులో కూర్చుని రకరకాల కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|