యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
సర్వేజనా సుఖినోభవంతు
- బొప్పన శ్రీనివాసులు
పేగు పడే మూగ వ్య- చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం‌కు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.

తర్వాత మనకు ఇచ్చిన నాలుగు కూపన్లను అమ్మితే మన డబ్బులు మనకు తిరిగి వచ్చినట్లే. ఆ నలుగురూ తమ కిచ్చిన తలా నాలుగు కూపన్లను అమ్మితే అందులో నుంచి మనకు కొంచెం కమిషన్ వస్తుందంట. ఆ విధంగా మనం ఆరవ స్టేజీకి చేరితే 4096 మంది నుంచి మనకి రూ.19691200 రూపాయల డీడీల వర్షం కురుస్తుందంట. దాదాపు రెండు కోట్ల రూపాయలు."

" వార్నీ...భలే గొప్ప స్కీంలాగా వుందే?! " ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాడు వెంకటపతి.

" గొప్ప స్కీమే. మా చుట్టం నాలుగు సంవత్సరాల క్రితం పదకొండు వేలు కడితే ఇంతవరకు ఒక్క డి.డి. కూడా రాలేదంట. అంతా మోసం...దగా..."

"ఇలాంటివన్నీ వేస్ట్ రాములూ... తంతే బూరెల బుట్టలో పడ్డట్లు ఏదో ఒక రకంగా జాక్‌పాట్ తగలాలి గానీ..."

" అసలు బూరెల బుట్ట అంటూ ఒకటి దొరకాలి కదా ? "

" మనకని రాసిపెట్టి వుంటే అదే దొరుకుతుంది గానీ..." అంటూ గత పదేళ్లుగా ఎన్నో రహస్యాలు పంచుకున్న రాములయ్యకి, దాదాపు ఇరవైఏళ్ల క్రితం తాను ఎలా బూరెల బుట్టలో పడ్డానన్న సంగతిని ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పడం ప్రారంభించాడు వెంకటపతి.

" 1978లో ఒకరోజు రాత్రి ఏం జరిగిందో తెలుసా? " అంటూ ఆగిన వెంకటపతిని, " కొంపదీసి ఆ రోజు రాత్రే బూరెల బుట్టలో పడ్డావా ఎమిటి? " ఉత్సుకతతో ప్రశ్నించాడు రాములయ్య.

" అట్టాంటి సంగతే. ఏ నెలో తెలియదు కానీ మొత్తానికి చలి కాలం. నాకూ, ఫోర్ నాట్టూకి నైట్ డ్యూటీ పడింది. అలా నాలుగు వీధులు చుట్టి వచ్చి. స్టేషన్లో కునుకు తీద్దామని బయలుదేరాం. రథం బజారు దాటి రెండు మలుపులు తిరిగామో లేదో చీకట్లో ఎవరో తచ్చాడుతుండటం కన్పించింది. గబుక్కున ఫోర్ నాట్టూ టార్చ్ లైట్ వెయ్యడమేమిటి... ఆ చీకటి మనిషి చేతిలో రెండు సూట్ కేసులతో పరుగు లంకించుకోవడమేమిటి... రెండూ...కన్ను మూసి తెరిచేంతలో జరిగిపోయాయి.

దొంగ!!

గభాల్న తెప్పరిల్లిన నేను దొంగగాడి వెంటబడ్డాను. కొంచెం దూరం నాతో పాటే పరుగెత్తుకొచ్చిన ఫోర్ నాట్టూ " అలసి పోయాను గురూ " అంటూ సూపర్ గోడౌను దగ్గరే కూలబడిపోయాడు. నేను మాత్రం ఆ దొంగనాయాల్ని వదిలిపెట్ట దలచుకోలేదు. ఫోర్ నాట్టూ చేతిలోంచి టార్చ్ లైట్‌ను లాక్కుని ముందుకు పరుగెత్తాను. ఆ దొంగగాడు మాయా బజార్లో దూరి నాలుగైదు సందులు తిరిగి ఊరి చివర పొలాలకు అడ్డంబడి పరుగెత్తుతున్నాడు. ఇసుకలో బూటు కాళ్లతో పరుగెత్తడం నాకు కష్టమైతే... ఆ దొంగ నాయాలుకి పల్లేరుకాయ ముళ్లపై పరుగెత్తడం కష్టంగా ఉన్నట్టుంది. అక్కడక్కడ నిలబడి ముళ్లని గబాగబా చేతులతో తీసుకోవడం కన్పించింది.

ఆ విధంగా... ఆ దొంగా, నేనూ పరుగెత్తి, పరుగెత్తి చివరికి సముద్రపు ఒడ్డు వచ్చేసింది. నా సామిరంగా వాడు సముద్రం ఒడ్డెంట పరుగు లంకించుకున్నాడు. నేను వదిల్తేగా?. చివరికి వాడి మదిలో ఏమనుకున్నాడో ఏమో గానీ, వాడి సూట్ కేసుల్లో ఒకదాన్ని అక్కడ పడేసి పరుగెత్తుతున్నాడు.

అదేందోగానీ... పెట్టెని చూడగానే నాకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇక, ఆ దొంగ గురించి నేను పట్టించుకోలేదు. సూట్ కేసు తెరచి చూద్దును గదా!!

సూట్ కేసు నిండా బంగారపు నగలు!! "

" ఎట్టా బంగారపు నగలే !! " ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాడు రాములయ్య. రాములయ్య ఆశ్చర్యంతో తనకేమీ పనిలేదన్నట్టు చెప్పుకుంటూనే పోతున్నాడు వెంకటపతి.

" నా గుండే ఒక్కసారిగా గుభేలు మంది. మతి పోయినంత పనై పోయిందనుకో. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. గభాల్న సూట్ కేస్ మూసి మెల్లగా తిరుగుముఖం పట్టాను. కొద్ది దూరం నడిచానో లేదో నా బుర్రలో పురుగు దొలవడం ప్రారంభమైంది. నగలన్నీ నాకే సొంతమైతే ఎంత బాగుంటుందోనని అన్పించింది. సూట్ కేసుని తీసుకెళ్లి స్టేషన్లో అప్పగిస్తే ఏదో చిన్న క్యాష్ అవార్డ్... మహా అయితే ప్రమోషన్ రావచ్చు. ఆ వచ్చే ప్రమోషన్ మెల్లగా రాకపోదు. ఎంత ప్రమోషన్ మెల్లగా రాకపోదు. ఎంత ప్రమోషన్ వచ్చి జీవితాంతం లంచాలు తీసుకుని సంపాయించినా చచ్చిపోయే లోపల అంత బంగారాన్ని నేను ఎలాగా సంపాయించలేననిపించింది.

అంతే!!

ఇంకొక మాట లేకుండా సూట్ కేసుని గుర్తుగా ఓ మర్రి చెట్టు మొదలు దగ్గర పాతిపెట్టి. కాళ్లీడ్చుకుంటూ సూపర్ గోడౌను దగ్గరకు చేరాను. అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్న ఫోర్ నాట్టూ, " ఆ నా కొడుకు మనకెక్కడ దొరకుతాడన్నా? రేప్పొద్దున లబోదిబోమంటూ ఎవడొస్తాడో...పద...అయినా నిన్నెవడూ వాడెంట అంత దూరం పరుగెత్తమనింది? " అని ఫోర్ నాట్టూ మాట్లాడుతున్నా మా గుండె గుబగుబలాడతానే ఉంది. తెల్లారి వాడు ఈ సంగతి ఎస్సైకి చెప్పాడు.

ఆ యస్సైగాడు, " ఏం వెంకటపతి... దొంగ దగ్గర సూట్ కేసులు కొట్టి ఎక్కడైనా దాచిపెట్టి వచ్చావా ఏమిటి? " అని పరాచికాలాడాడు. యస్సై ఊరకే పరాచికాలాడినా నాకొక రకంగా అయిపోయింది. మరుదినం రాత్రి ఆ మర్రి చెట్టు దగ్గర్నుంచి సూట్ కేసును తీసుకుని తెల్లారికంతా మా అత్తారింటికి
చేరేశాడు.


మా అత్త గారు కూడా వాళ్ల ఒక్కగానొక్క కూతుర్మి ... అదే మా ఆడోళ్లని... ఇరవై ఏళ్లు భద్రంగా సాకి నా చేతిలో పెట్టినట్టుగా...ఆ బంగారపు నగలని జాగ్రత్తగా దాచి పెట్టారనుకో... అందుకే రిటైరయ్యింతర్వాత మా అత్తగారి ఊరైన ఈ ఊర్లోనే సెటిలయ్యా."

" మరైతే ఆ తెల్లారి సొమ్ము పోయిందంటూ ఒక్కడు కూడా కంప్లైంటూ చెయ్యలేదా? " వెంకటపతి మాటలకు అడ్డు తగులుతూ అడిగాడు రాములయ్య.

" ఆ తెల్లారేంటి? అది జరిగి ఇరవైయేళ్లు అవుతున్నా... ఇంతవరకు దాని గురించి ఒక్క కంప్లైంట్ వస్తే ఒట్టు పెట్టు. "

" నాకు భలే ఆశ్చర్యంగా ఉంది వెంకటపతి. "

" ఏంటి? ఆ నగల్ని రిటైరయ్యే దాకా దాచిపెట్టి. ఆ తర్వాత బయటకు తీసి వ్యాపారం చేసి సంపాయించానని నలుగురి చేత నమ్మించగలిగేననా? !"
నెరసిన బుర్ర మీసాలను సవరించుకుంటూ అన్నాడు వెంకటపతి.

" అదిగాదు. "

"మరి ? "

" ఇంతా చెప్పినోడివి... ఆ సూట్ కేసులో కాస్త క్యాష్ ఉందన్న సంగతి చెప్పడం మర్చిపోయావే "

" అంటే...? "

" ఆ రోజు ఆ సూట్ కేసుల దొంగని నేనే!! "

ఒక్కసారిగా వెంకటపతి 'గతుక్కు' మని ఉలిక్కిపడ్డాడు. వెంకటపతి 'గతుక్కు'తో పనిలేనట్లుగా రాములయ్య తన అనుభవాన్ని చెప్పడం ప్రారంభించాడు.

" ఆ రోజు రాత్రి నాకు నరకం కన్పించిందనుకో. కింద పల్లేరు కాయలు. వెనుక నువ్వు.

అప్పటిదాకా చిల్లరమల్లర దొంగతనాలు చేసిన నాకు యం.యల్.ఏ. గారింట్లో పంట పండింది. ఒక సూట్ కేసు నిండా సొమ్ములుంటే...ఇంకొక సూట్ కేసు నిండా డబ్బు. దీంట్లో డబ్బు దాంట్లో కొంత సర్ది, జీవితానికి ఆ డబ్బు చాలనుకుని బయటపడితే మీరు వెంటపడ్డారు.

ఎంత స్పీడుగా పరుగుత్తుతున్నా నువ్వేమో వదిలేట్లు లేవు. నగలయితే. వాటిని కరిగించి అమ్మడం నాకు ఇబ్బంది. అందుకే నగల సూట్ కేసుని నీకు వదిలేసి డబ్బు సూట్ కేసుతో పరుగెత్తాను. అట్లా కొంతకాలం గడిచింతర్వాత ఆ డబ్బుతో ఆస్తిపాస్తులు కొన్నా. ఈ ఆస్తి నేను కష్టపడి సంపాయించానని జనాన్ని నమ్మించడానికి ఎన్ని అడ్డదిడ్డమైన వ్యాపారాలు చేశానో తెల్సా?

నాకున్నది ఒక్కడే కొడుకాయే. వాడూ వాడి అత్తగారింట్లో సెటిలై పోయాడు. మా వియ్యంకుడు కోటీశ్వరుడాయె. అందుకే ఆయన మాట ప్రకారమే సూట్ కేసు డబ్బులతో నేను సంపాయించిన ఆస్తిపాస్తులన్నింటిని అమ్మి ఈ ఊళ్లో ఓ ఐదారు షాపింగ్ కాంప్లెక్సులు కట్టించా.

అయినా ఆ యం.యల్.ఏ గాడు తనింట్లో దొంగతనం జరిగిందని ఇంతవరకూ ఎందుకు కంప్లైంట్ చెయ్యనట్లు? ! " రాములయ్య అనుభవాన్ని ఉత్కంఠతో విన్న వెంకటపతి చిన్నగా నిట్టూర్చి, " విధి ఎంత చిత్రమైంది రాములయ్యా? ! " మన ఇద్దర్నీ చివరకు ఎలా దగ్గరకి చేర్చిందో చూశావా? " అంటూ ఆశ్చర్యపోయాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
సమయ స్పూర్తి
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace