|
| పాప కోసం... | |
రచయిత పరిచయం - చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
బెంగుళూరుకు వెళ్లే ట్రయిన్ కోసం హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎదురుచూస్తున్నారు కొత్తగా పెళ్లైన దంపతులు లక్ష్మీ బాలాజీలు. ట్రెయిన్ రావడానికి ఇంకా అర గంట టైముండడంతో అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుని పరిసరాలను గమనిస్తున్నారు. లక్ష్మీ అలా అటువైపు, ఇటువైపు చూస్తుండగా...ఓ పదేళ్ల పాప సర్కస్ ఫీట్లు చేస్తున్న దృశ్యం కన్పించింది.
ఇంత చిన్న వయసులో ఒక పూట తిండి కోసం అలా వంటిని విల్లులా చేసుకుని ఆ ఫీట్లు చేస్తుండటాన్ని చూసి ఆమె హృదయం అలాగే కరిగిపోయింది. బాలాజీ వైపు చూసింది. ఆమె చూపులో భావాన్ని అర్థం చేసుకున్న వాడిలా బాలాజీ పక్కనే ఉన్న ఓ దుకాణంలో ఓ బిస్కట్ ప్యాకెట్ కొన్నాడు.
పెళ్లయిన కొద్ది రోజులకే తన భావాన్ని అర్థం చేసుకున్న భర్తను చూసి లోలోపల సంతోషపడింది. అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. దుకాణంలో కొన్న ఆ బిస్కట్ ప్యాకెట్‌ను భర్త వేగంగా విప్పడం చూసి ఆశ్చర్యపోయింది. అలా చూస్తుండగానే... అందులో రెండు బిస్కెట్లు తీసుకున్న బాలాజీ మిగిలిన ప్యాకెట్‌ను ఆ పాపకు ఇవ్వమని సైగ చేస్తూ భార్య చేతిలో పెట్టాడు.
భర్త చర్య ఏ మాత్రం అర్థం కాని లక్ష్మీ దానిగురించి ఆయనను మొహంపైనే అడిగేసింది. "రెండు బిస్కెట్లు తీసుకోకుంటే ఏంటి?" అని అడిగిన భార్యకు బాలాజీ నింపాదిగా సమాధానమిచ్చాడు.
" అలాగే ఇచ్చామంటే ఆ ప్యాకెట్‌ను తిరిగి ఆ దుకాణంలోనే ఇచ్చేసి డబ్బు తీసుకోవచ్చు. కాబట్టే అలా చేశా" భర్త సమయ స్ఫూర్తికి మెచ్చుకుంది లక్ష్మీ లోకం పోకడ తెలియని దానిలా.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|