యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
సమయ స్పూర్తి
- బొప్పన శ్రీనివాసులు
రచయిత పరిచయం - చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం‌కు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.

ప్రయాణికులతో రద్దీగా ఉన్న విజయవాడ బస్టాండులో కామేశం భార్య సుబ్బలక్ష్మితో పాటు గుంటూరు వెళ్లే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. పది నిమిషాల తర్వాత వచ్చింది బస్సు.

గుంటూరు వెళ్లే బస్సులో తన భార్యను ఎక్కించి ఆఫీసుకు చేరుకున్నాడు కామేశం. ఆఫీసు పనిలో మునిగిపోయిన కామేశం సెల్ మోగింది. కామేశం ఎత్తే లోపు రింగ్ ఆగిపోయింది.

ఎవరా అని చూస్తే తన భార్య దగ్గర్నుంచి మిస్డ్ కాల్. వెంటనే పోన్ చేశాడు కామేశం.

"హలో ఇన్‌స్పెక్టర్ బాబాయి గారా" అవతలి వైపు నుంచి విన్పించింది.

"బాగున్నారా బాబాయి గారు ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నారు ఏలూరు నుంచా. మా ఇంటికొస్తున్నారా తప్పకుండా రండి.

నేను అటువైపే వస్తున్నాను . దగ్గరికొచ్చాక కాల్ చేస్తాను. పిన్నిగార్ని అడిగినట్టు చెప్పండి" అని చెప్పి కట్ చేసింది.

ఏమి అర్ధం కాక అయోమయంలో పడ్డాడు కామేశం.

ఆ రోజంతా సుబ్బలక్ష్మికేమయిందని ఆలోచిస్తూనేవున్నాడు.

భోజనం చేసి పడుకుందామని ఆలోచిస్తున్న సమయంలో ఫోన్ మోగింది. గందరగోళంలో కామేశం అనాలోచితంగా వెళ్లి ఫోన్ తీశాడు.

"హలో ఏవండి నేను సుబ్బలక్ష్మిని నిన్న బస్సులో నా వెనుక కూర్చున్న కుర్రాడు అదో టైపు. వంకర వేషాలు, వెకిలి వేషాలు వేశాడు.

అందుకనే మీతో పోలీస్ తో మాట్లాడినట్లు మాట్లాడాను. దాంతో అతను కాస్త తగ్గాడు. నా పాచిక పారింది. నేను హాయిగా ఇంటికి చేరుకున్నాన" ని చెప్పింది సుబ్బలక్ష్మి.

భార్య సమయస్పూర్తికి ఆనందపడ్డాడు కామేశం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace