|
| పొగడ్తల పరమానందం | |
రచయిత పరిచయం - చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
ప్రతి ఒక్కరిలోనూ ప్లస్, మైనస్ పాయింట్లు ఉంటాయన్నది తెలిసిందే. కొందరు తమ ప్లస్ పాయింట్లనే ఆయుధాలుగా చేసుకుని ముందుకు వెళుతుంటే, మరి కొందరు దానిని కూడా సొమ్ము చేసుకోలేక చతికిలబడుతుంటారు.
అయితే వీరి మధ్య పరమానందం టైప్ భిన్నమైంది. పొగడ్తలకు పొంగిపోని వారంటూ లేరంటాడు. ఎదుటి వారిలోని ప్లస్ పాయింట్లను వెతికి పట్టుకుని వారిని ఆ పాయింట్ల ఆదారంగా పొగుడ్తూ వారిని ఆకట్టుకునే వాడు. దానినే తన జీవితానికి ఎదుగుదల ప్రమాణంగా కూడా చేసుకున్నాడు.
ఇలాగే తన పక్కింటి వ్యక్తి చేతి వ్రాతను పొగడటం ద్వారా బ్యాంకు మేనేజరైన ఆయన సాయంతో ఇంటి లోను సాధించుకున్నాడు.
మరో సందర్భంలో ముందుగా పరిచయం కూడా లేని ఓ వృద్ధుడి జ్ఞాపక శక్తిని ఆకాశానికి ఎత్తేయడం ద్వారా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఆయన తనయుడితో పరిచయం పెంచుకుని తన పనులను చకచకా సాధించుకోగలిగాడు.
ఇలా ప్రతి ఒక్కరిలోనూ ప్లస్ పాయింట్లను వెతికి పట్టుకుంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తుతూ మంచి పేరు సంపాదించాడు పరమానందం. అయితే కొత్తగా వచ్చిన తమ కంపెనీ మేనేజరుపై మాత్రం అతని పొగడ్తలు ఏ మాత్రం పనిచేయలేకపోయాయి. పనిలో నిక్కచ్చిగా వ్యవహరించే ఆయన దగ్గర తన ఆటలు సాగవని తెలుసుకున్న పరమానందం ప్లేటు మార్చాడు.
దీంతో నెల రోజుల్లోనే ఆ మేనేజరును తన మాటల గారడీతో వలలో వేసుకున్నాడు పరమానందం. అయితే ఇంత స్ట్రిక్టుగా ఉన్న మేనేజర్‌ను కూడా ఎలా బుట్టలో వేసుకున్నాడోనని సహ ఉద్యోగులకందరికీ ఆశ్చర్యమేసింది.
తన సందేహాన్ని దాచుకోలేని ఓ సహోద్యోగి పరమానందంను నేరుగానే అడిగేశాడు.
ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే ఊహించిన పరమానందం నింపాదిగా "ఆ ఏముందిరా ఆయన దేనికైతే పడరో దానికే పడేట్టు చేశాను. ఆయనకి పొగడ్తలంటే ఇష్టముండదు కదా. దాంతోనే బోల్తా కొట్టించా" అన్నాడు.
"ఎలా...?" అని ప్రశ్నించాడా ఉద్యోగి
"ఏమీ లేదు మీలాగా పొగడ్తలకు బోల్తా వడని వాళ్లు కోటికి ఒక్కరో ఇద్దరో ఉంటారనన్నానంతే" అని తాపీగా చెప్పాడు వరమానందం.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|