|
| హలో డాక్టర్ | |
రచయిత పరిచయం - చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
ఆ రోజంతా తీరిక లేకపోవడంతో బాగా అలసిపోయిన హార్ట్ స్పెషలిస్ట్ కేశవ రావ్ రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. తొందరగా భోజనం ముగించుకుని నిద్రలోకి జారుకున్నాడు.
ఓ వైపు గుర్రు పెట్టి ఆయన నిద్రిస్తుండగానే, సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంటకు ఉన్నట్టుండి ఆయన మొబైల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మంది. ఉలిక్కిపడి లేచాడు డాక్టర్.
"హలో డాక్టర్ నా పేరు శంకర్ నేను కూకట్ పల్లి నుంచి మాట్లాడుతున్నాను." అవతలి వైపు నుంచి ఈ మాటలు విన్పించగానే అంత అలసటలోనూ డాక్టర్ హడావుడిగా
" చెప్పండి ఏంటి ప్రాబ్లమ్" అని ప్రశ్నించాడు.
" బైపాస్ సర్జరీ"
" ఓకే చేసేద్దాం. పేషంట్‌ను తీసుకొచ్చి అడ్మిట్ చేయండి. అంబులెన్స్ కూడా రెడీగా ఉంది. అడ్రస్ చెప్తే పంపిస్తాను."
" అది కాదు డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలా వద్దా అని తెలుసు కోవటానికో టెస్ట్ చేస్తారుగా అది"
"ఆంజియోగ్రామేకదా. దానికేముంది చేసేద్దాం."
" హిహిహి... అది చెయ్యడానికి కాదు డాక్టర్ ఆ పదం తెలియక నిన్నట్నుంచి తల పీక్కుంటున్నా. మీరైతే కరెక్ట్‌గా చెప్తారని చేశానంతే. చాలా థ్యాంక్స్ డాక్టర్"
అతని మాటలు విన్న తర్వాత ఏం చేయాలో తెలియక డాక్టర్ తల పీక్కున్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|