|
| మద్యం మత్తు
| |
రచయిత పరిచయం-చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
భద్రయ్య పక్కా తాగుబోతు. నిద్రలేవగానే మద్యం సేవించాలని తహతహలాడుతాడు. మొదట ఆ పని చేయకుంటే కాళ్లు చేతులూ లాగేస్తాయి. నోట్లో లాలాజలం ఊరుతోంది. ఎలాగైనా మందు కొట్టాలని తపిస్తాడు.
ఇనుప కొలిమిలో పనిచేస్తున్న భద్రయ్య ఉదయం పనికి వెళితే సాయంత్రం వరకు గొడ్డు చాకిరి చేస్తాడు. సాయంత్రం యజమాని ఇచ్చే కూలీని తీసుకుని నేరుగా.. పక్కనే ఉన్న మద్యం దుకాణానికి వెళ్లి పీకల దాకా మద్యం సేవించి, ఉన్న నాలుగు పైసలను ఖాళీ చేసుకుని వట్టి చేతులతో ఇంటికి వెళ్లటం దినచర్యగా ఉంది.
భర్త అవతారాన్ని చూసిన భార్య సరస్వతి .. ఏ మయ్యా నీవు ఓ మనిషివేనా. ఇంట్లో భార్యా పిల్లలు ఉన్నారే. వారు నన్ను నమ్ముకుని ఉన్నారే అనే ఆలోచనా ఏమాత్రం లేకుండా పీకలదాకా మద్యం సేవించి వస్తావా అని గయ్యాళి గంపలా మాట్లాడసాగింది. పిడికెడు మెతుకులు చేసేందుకు కూడా ఐదు పైసలు లేవు.
నీవేమో ఈ రకంగా వస్తున్నావు. ఇలా భార్య ఎన్నోవిధాలుగా భర్తకు చెప్పి చూసింది. అయితే భద్రయ్య ఏ మాత్రం మారేలాలేడు. భద్రయ్య వేషాన్ని చూసిన కొలిమి యజమాని పనికి రావద్దని చెప్పాడు. దీంతో ఉన్న పని పోయింది.
భర్తకు ఉన్న పని పోయిందని తెలుసుకున్న సరస్వతి, ఆరో తరగతి చదువుతున్న తన కుమార్తెను తీసుకుని పక్కనే ఉన్న రైస్ మిల్లుకు పనికి పోసాగింది. ఎందుకంటే మిగిలిన ఇద్దరు పిల్లలు పోషించేందుకు వేరే మార్గం సర్వతికి తెలియలేదు. అయితే.. భార్య కూలికి వెళ్లగా వచ్చిన డబ్బులను ఏదో విధంగా లాక్కోవడం భద్రయ్య పనిగా మారింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|