యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
ప్రతిస్పందన
- బొప్పన శ్రీనివాసులు
రచయిత పరిచయం -చిత్తూరు జిల్లా వరదయ్య పాలెం‌కు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.

మీనాక్షి, భరత్ అన్యోన్య దంపతులు. వీరికి వివాహమై దశాబ్ద కాలం పూర్తయింది. అయితే పిల్లలంటే ఆ దంపతులకు ఎంతో ఇష్టం.

పుత్ర సంతానం కోసం వారు చేయని పూజలు పునస్కారాలు, తిరగని ఆలయాలు, మొక్కని దేవుళ్ళు లేరు. అయినా ఈ దంపతుల కోర్కె మాత్రం నెరవేరలేదు.

దీన్ని తీర్చుకునేందుకు మీనాక్షికి ఓ ఉపాయం వచ్చింది. వెంటనే.. 20 ఏళ్ళలోపు వయస్సున్న అందమైన యువతుల ఫోటోలను పెళ్లిళ్ళ బ్రోకరు నుంచి సేకరించింది. ఒక రోజు రాత్రి భోజనం ముగించుకుని పడక గదిలోకి వెళ్ళారు.

తాపీగా.. తాను సేకరించిన ఫోటోలను భర్త చేతికి ఇచ్చి.. వాటిని ఒక్కొక్కటిగా చూసిన భరత్ ఒక్క యువతి ఫోటో కూడా నచ్చలేదని అన్నాడు. అయితే మీనాక్షి మాత్రం ఆ ఫోటోల నుంచి ఒక అందమైన అమ్మాయి ఫోటోను చూపించి.. రెండో పెళ్లి చేసుకోవాల్సిందిగా భర్తను కోరింది.

ఆ మాటలకు షాక్‌కు గురైన భరత్.. కొద్ది సేపు ఎలాంటి మాటలు రాలేదు. వెంటనే తేరుకున్న భరత్ ఆ రాత్రిని ఏదో విధంగా భార్యతో గడిపాడు. అయితే మీనాక్షి మాత్రం.. రెండో పెళ్ళి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయసాగింది.

ఒక రోజున భరత్... తాను పది మంది అబ్బాయిల ఫోటోలను తీసుకుని వచ్చి... ఒక అబ్బాయిని ఎంపిక చేయాల్సిందిగా భార్యను కోరాడు. ఆమె ఎందుకనోలే అనుకుని ఒక యువకుడి ఫోటో తీసి బాగున్నాడని చెప్పింది. వెంటనే ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాల్సిందిగా చెప్పాడు.

కొద్ది సేపు నోట మాట రాని మీనాక్షికి... ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. భరత్ కలుగజేసుకుని నీవు నాకు ఏవిధంగా రెండో పెళ్లి కోసం అమ్మాయిని చూస్తున్నావో.. అలాగే నేను నీకు అబ్బాయిని చూస్తున్నానని సమాధానం ఇచ్చాడు.

మనకు పిల్లలు లేదనే చింత, బెంగ లేదు. నీవు ఎందుకో నాకు నచ్చావ్. నీలోనే పిల్లలు లేని లోటును తీర్చుకుంటున్నాను అని చెప్పాడు. ఇలా భార్య ఒత్తిడి నుంచి భరత్ తప్పించుకుని, భార్యపై తనకున్న ప్రేమను వ్యక్త పరిచాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
దర్శనం
ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
ప్రియుని ద్వారా అవకాశాలు : ఆయెషా
ప్రియుని ద్వారా బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్తోంది బాలివుడ్ నటి ఆయెషా టాకియా...
దక్షిణాది చిత్రసీమలోకి మళ్లీ జయప్రద
సినీరంగంలో ఆంధ్రాదే అగ్రస్థానం: కేంద్రం వెల్లడి
ఆరోగ్యం
పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace