|
| దిష్టి గుమ్మడికాయ తెచ్చిన తంటా | |
గ్రంథకర్త పరిచయం -చిత్తూరు జిల్లా వరదయ్య పాలెంకు చెందిన బొప్పన శ్రీనివాసులు గత 10 సంవత్సరాలుగా పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం చెన్నై చూలైమేడులో నివసిస్తున్న ఈయనకు కథలు, కవితలు రాయడంతో పాటు సంగీతం, క్రీడలు ఈయన ప్రధాన అభిరుచులు.
పరమశివం కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఇతను స్వభావరీత్యా మహా అహంకారి.
ఓ అమవాస్య రోజున దుకాణానికి దిష్టి తీసేందుకుగాను దిష్టి గుమ్మడి కాయను ఒక దాన్ని కొని దానికి చిన్న రంధ్రం వేసి, అందులో కుంకుమ, పసుపు, తొమ్మిది రూకలు వేసి, చిన్న కర్రతో కలియతిప్పుతున్నాడు.
ఏమిటో ఈ రోజు బలంగా పూజ చేస్తున్నావ్ అంటూ.. పక్క దుకాణం యజమాని పరమశివాన్ని అడిగాడు. ఏముందీ.. ఈ రోజు అమావాస్య కదా.. అందుకే దుకాణానికి గుమ్మడికాయతో దిష్టి తీద్దామని ఇలా చేస్తున్నానని సమాధానం ఇచ్చాడు పరమశివం.
ఏమో.. ఈ మధ్య రోడ్లపై గుమ్మడి కాయలు పగుల కొట్ట కూడదని, దినపత్రికలు, రేడియోలు, టీవీలలో పోలీసులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు కదా.. అందుకని గుమ్మడి కాయ కొట్టేందుకు బదులుగా చిన్న నిమ్మకాయను కోసి వేస్తే సరిపోతుంది కదా... అని సలహా ఇచ్చాడు.
ఏం.. అమావాస్యకు నేను మాత్రమే గుమ్మడి కాయను రోడ్డులో పగులగొడుతున్నానా? ఊరిలోని వ్యాపారులందరూ కొడుతున్నారు కదా? రోడ్డులో పోయే వారు కింద చూచుకుని వెళ్ళాలి. అని తల పొగరుతో సమాధానం ఇచ్చాడు.
వెంటనే దుకాణంలోని ఫోను మోగింది. ఏమండీ.. స్కూటరుపై వెళ్ళిన మన అమ్మాయి రోడ్డులో కొట్టిన గుమ్మిడి కాయ వల్ల కింద పడి తీవ్రంగా గాయపడిందని భార్య పరమశివానికి చెప్పింది. ఆ మాట పరమశివం ముఖం మీద కొట్టినట్టయ్యింది.
మంచి మాటలు చెప్పిన పక్క దుకాణం మాటలను పెడచెవిన పెట్టిన అహంకారి పరమశివం అలా తగిన గుణపాఠం నేర్చుకున్నాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - హిందూ ముస్లిం మత సామరస్యానికి పాటు పడిన కృషీ వలుడు, సిక్కు మత స్థాపకుడు... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - సాధారణంగా అందరి గృహాలలో తులసి కనిపిస్తుంది. అయితే తులసితో కలిగే లాభాల... |
| |
|
|
|
|
|
|
|