యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
రాఖీ బంధం
సినిమాల్లో అటువంటి సీన్లు కన్పించే మా పాపతో చిన్నప్పటి ఆ సంఘటన చెప్పినపుడు ఎంత నవ్వుతుందో... ఆ నవ్వుని చూడాలి.

చెల్లిని ‘చెల్లి’ అనో, పేరుపెట్టో పిలవకుండా పాప అనడం ఏంటనుకోవచ్చు. పుట్టినప్పుడు న్నపిల్ల కదా. పుట్టేటపుడు మేమంతా ఆడపిల్లే పుట్టాలని ఎదురుచూశామట. మంత్రసాని వచ్చి పాప పుట్టిందని చెప్పగానే ‘పాప’ పుట్టింది పాప పుట్టింది అని ఎంతో గంతులేశామనీ, అలా మాకు తెలీయకుండానే ‘పాపా’ అని పిలవడమే కంటిన్యూ అయిపోయింది. మా చెల్లి ఇపుడు ఎంత ఎదిగినా పేరు ‘విజయకుమారి’ అని స్కూలు రికార్డుల్లో ఉన్నా ‘పాపా’ అని పిలవటంలోనే మాకెంతో సంతోషంగా ఉంటుంది.

‘పాప’ అంటే మరికొన్ని అర్ధాలున్నప్పటికీ మా అందరికీ ‘కంటిపాప’ లాంటిదే మా చెల్లి.
చిన్నప్పుడు ఓ సారి మా చెల్లి నేనూ తెల్లారగట్లే ఈత పళ్ళు కెళ్లేవాళ్ళం. కిందపడిన పళ్లు పాడైపోటమో, బాగుండకపోవటమో జరిగేది. అందుకని ఓ రోజు నేను చెట్టెక్కాను. ఈత గెలకి చాలా పళ్ళున్నాయి. దాన్ని ఒక చేత్తోను, మరోచేత్తో ఎండిపోయిన కమ్మనీ పట్టుకొని దులిపేస్తున్నాను. చిలికిపోయి ఉండటం వల్ల కమ్మ ఊడి వచ్చేసింది. మరోచేత్తో గెలను దులుపుతున్నాను గాని పట్టుకోలేదు కదా. అంతెత్తు నుండీ కిందపడిపోయాను. మాట రావడం లేదు. నడుం లేపలేకపోతున్నాను. ఏడ్వలేకపోతున్నాను, ఉక్కిరిబిక్కిరై పోతున్నాను. అప్పుడు మా చెల్లి ఆ చెట్టుకిందే బెడ్డలమీదే కూర్చుని, నా తల ఒళ్ళోపెట్టుకొని, గట్టిగా ఏడ్చస్తుంటే, ఆ ఏడుపు ఎలాగాపాలో నాకర్ధం కాలేదు.

నా బాధకంటే మా పాప ఏడుపు నా పటిమ ముందు చెయ్యాలనీ, ఏదొకటి చెప్పడానికి మాటలొస్తే బాగుండుననీ తెగప్రయత్నించాను. దేవుళ్ళను ఎంతమందినో మనసులోనే దండం పెట్టేసుకున్నాను. మా పాప కన్నీళ్ళని చూడలేక నేను ఓ చేత్తో తుడుస్తుంటే, ఇంకా ఏడ్చేసింది.

ఆ ఏడుపు విని, పొలం పనులకి పొద్దున్నే వెళ్ళేవాళ్ళు, పొలాల దగ్గరకెళ్ళే రైతులు ‘ఏం జరిగింది’ అంటూ మా దగ్గరకొచ్చి, గబగబా నన్నూ, మా చెల్లెల్ని ఇంటికి తీసుకెళ్ళారు.
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4| 5| 6| 7
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
దర్శనం
ధార్మిక కథనాలు - అన్ని రకాల సుఖ, సంతోషాలకు మూల కారణం సంతృప్తిగా నిర్వచించారు మన పెద్దలు.
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - కొబ్బరిని మనం దినచర్యలో తరచుగా ఏదో ఒక దానికి ఉపయోగిస్తూనే ఉంటాం.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace