యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
రాఖీ బంధం
రెండు మూడు సార్లు చదివి, నా చేతికి ఉన్న రాఖీని సుకుమారంగా తడిమాను. కళ్ళ నుండి రెండు మూడు స్వచ్ఛమైన బిందువులేవో జలజలరాలాయి వేడిగా!

కాగితం మీద పెన్సిల్‌తో రూళ్ళుకొట్టి, దానిమీద కుదించి, కుదించి రాసిన అక్షరాలు వాటినే చూస్తూ వాటిలో ఏదో చూస్తుండిపోయాను. అనురాగానికి అర్ధమైన చెల్లి .... ఔను మా చెల్లిప్పుడేమి చేస్తుందో. మా నల్గురు తర్వాత పుట్టిన ఒక్కగానొక్క పిల్ల. ప్రేమానురాగాల ప్రతిబింబం ఎలాగుంటుందో చూసుకోమని దేవుడు మాక్చిచిన వరం. ఏం చేస్తుందో !

చిన్నప్పుడు స్కూల్లో ఓ పిల్ల మా చెల్లి కట్టుకున్న కొత్త బట్టల గురించి ఏదో అంటే, మా చెల్లి కళ్ళల్లో కన్నీళ్ళు చూసి తట్టుకోలేక, అలా అన్న పిల్ల, మా ఫ్రెండ్‌ చ్లెలెలైనా సరే చెంప చెల్లుమనిపించాను. మా చెల్లి మీద నాకంత ఇష్టం ఉంటే ఎదుటి వాళ్ళకి అంత ఇష్టం ఉంటుందని గానీ, గొడవలవుతాయని గానీ ఇవేమీ ఆలోచించలేదు. అలాగే చాలా గొడవలయ్యాయి. అది వేరేసంగతి.

మా చెల్లి పిలకలేసుకుంటున్నప్పుడే ఎక్కడేపువ్వు కన్పించినా పట్టుకెళ్ళి పెట్టేసేవాణ్ణి. కొన్ని పువ్వులు తల్లో పెట్టుకోరట. నాకేం తెల్సు!
ఓ సారి మా చెల్లిని సినిమాకి తీసుకెళ్ళాను.

హీరో - విలన్‌ బృందానికి మధ్య ఓ ఫైటింగ్‌ సీను వచ్చింది.

అమాంతంగా నా ఒళ్ళో కొచ్చేసి, కళ్ళు బుల్లి బుల్లి చేతుల్తో మూసేసుకుని ౞కొట్టేసుకుంటున్నారు బాబోయ్‌ అంటుంటే, ౞పాపా ... అది సినిమా అమ్మా ... నిజంకాదు అని ఎంత నచ్చచెప్పినా వింటే కదా... వద్దు వెళ్ళిపోదాం. పందిగాడు పట్టుకొంటే, మిగిలిన వాళ్ళంతా పాపం ఒకణ్ణి పట్టుకొని కొట్టేస్తున్నారు. మనమీదికే వచ్చిపడిపోతున్నాడు వెళ్ళి పోదామని హాలు బయటికి వచ్చిందాకా ఒకటే గోల.
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4| 5| 6| 7
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
దర్శనం
ధార్మిక కథనాలు - అన్ని రకాల సుఖ, సంతోషాలకు మూల కారణం సంతృప్తిగా నిర్వచించారు మన పెద్దలు.
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - కొబ్బరిని మనం దినచర్యలో తరచుగా ఏదో ఒక దానికి ఉపయోగిస్తూనే ఉంటాం.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace