యాహూ! | నా యాహూ! | మెయిల్ | ఫోటో
శోధన
 
   హోంపేజీ సాహిత్యం కథలు
రాఖీ బంధం
ఆరోజు రాత్రి రూమ్‌లో పడుక్నునాను గాని నిద్రపట్టలేదు. మంచం మీద అటూ ఇటూ చాలాసార్లు దొర్లాను. రాఖీలు నలిగి పోతున్నాయేమోనని చేతిని మాత్రం జాగ్రత్తగానే జరుపుకునే వాణ్ణి!
రాఖీని తీసిన కవరులోనే ఉన్న చెల్లి ఉత్తరం తీసాను.
అన్నయ్యా!

ప్రతీ ఏడాదీ నేనే నీ చేతికి ఈ రాఖీని కట్టే దాన్ని. నువ్విచ్చే బహుమతిని మా స్నేహితులందరికీ గర్వంగా చూపించేదాన్ని. ఈసారి కూడా పంపావనుకో. కానీ నేనే నీ చేతికి ఈ రాఖీని కట్టలేకపోతున్నందుకే బాధగా ఉందిరా... ఎంత ఇంటర్‌నల్‌ పరీక్షలయితే మాత్రం మీ మాస్టారికి ఆ మాత్రం తెలీదా- రాఖీ పండక్కి శెలవివ్వాలని! పోనీలేరా .. నేనే నీ చేతికి కట్టినట్లు భావించుకొని, నాలాంటి ఓ చెల్లిచేత కట్టించుకొని, బహుమతి కూడా ఇవ్వు. ఒరే అన్నయ్యా ఓ విషయం - ఆ బహుమతి మాత్రం నాకు పంపించిందానికంటే కూడా మంచిదైతే నేనూరుకోను జాగ్రత్త. ఆ విషయాలన్ని నాకు రాయి ఉత్తరంలో ...

అన్నయ్యా .... నీకు తెలుసో లేదో ఈ రాఖీ కోసం మూడు రోజుల నుంచి ఎన్ని షాపులు తిరిగానో. నీ చేతికున్న రాఖీ మిగిలిన వాళ్ళకెవ్వరికీ ఉండకూడదని అనుకొని మరీ వెతికి వెతికి కొని పంపుతున్నాను.

పెద్ద, నువ్వే కొడుకువన్నట్లు అమ్మ రోజూ భోజనాల దగ్గర తెగ బాధపడి పోతుంది రా ... ఎప్పుడొస్తావు? ఓ నిజం చెప్పనా నువ్వు అన్నం తినేటప్పుడు నీ చేతి ముద్ద కోసం నేనూ బాధపడ్తున్నాను రా! సర్లే, దసరా పండక్కి తప్పకుండా రావాలి. నువ్వు పులి వేషం వేస్తే నిన్నేడిపించాలనుంది. ఈ సారి నువ్వెంత భయపెట్టినా నేనేమీ భయపడిపోను.

స్కూలుకి జాగ్రత్తగా వెళ్తున్నాను.
అమ్మనేమీ ఏడిపించటం లేదు.
వెంటనే ఉత్తరం రాయవలెను.
ఉంటాను మీ చెల్లి ...
(మూలం - వెబ్‌దునియా)
1| 2| 3| 4| 5| 6| 7
 
మరిన్ని...
సిన్నోడి సేద్యం (మూడో భాగం)
సిన్నోడి సేద్యం (రెండో భాగం)
సిన్నోడి సేద్యం (మొదటి భాగం)
సర్వేజనా సుఖినోభవంతు-1
పాప కోసం...
ప్రేమ పిచ్చోడు
దర్శనం
ధార్మిక కథనాలు - అన్ని రకాల సుఖ, సంతోషాలకు మూల కారణం సంతృప్తిగా నిర్వచించారు మన పెద్దలు.
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
AP
 
విదేశాలకు వెళ్లేందుకు శిల్పకు సుప్రీం ఓకే
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.
కేన్స్ చిత్రోత్సవాలకు అభిషేక్‌తో పాటు ఐష్
నకిలీ పాస్‌పోర్టు కేసులో మోనికాకు బెయిల్ మంజూరు
ఆరోగ్యం
పెరటి వైద్యం - కొబ్బరిని మనం దినచర్యలో తరచుగా ఏదో ఒక దానికి ఉపయోగిస్తూనే ఉంటాం.
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace