|
| రాఖీ బంధం | |
ఆ రోజు క్లాసు కెళితే మా క్లాస్‌మేట్స్ శైలూ, కరుణా క్లాసుకొచ్చేటపుడు రాఖీలు పట్టుకొచ్చి కట్టారు నాకు. వాళ్ళపట్ల నా కేదో అనురాగం నా కళ్ళలో కన్పించకుండా పొంగిన ఆనంద కెరటాలు.
ఏమి మాట్లాడాలో నాకర్ధం కాలేదు.
నన్ను కాసేపు గమనించి, నవ్వుతూ క్లాసవ్వగానే వెళ్ళిపోయారు. నా చేతికున్న మూడు రాఖీల్ని చూసుకొని రోజంతా పొందిన సంతోషమెంతని చెప్పను!
నా చేతికున్న రాఖీల్ని చూసి ఎవరు కట్టారనీ, కట్టిన వాళ్ళకేమిచ్చావనీ చాలా మంది ఫ్రెండ్స్ అడిగారు. మౌనంగా చిన్న చిరునవ్వే నా సమాధానం. ఆ ప్రశ్నల ఫలితమేనేమో మధ్యాహ్నం క్లాసుకెళ్ళేటప్పుడు రెండు చాక్లెట్స్ కొనుక్కెళ్ళాను. కరుణా, శైలజలకిద్దామని. చేరింది కొత్త కావడమో, రాఖీలు కట్టింది పొద్దున్నయితే చాక్లెటస్ మధ్యాహ్నం ఇవ్వటమేంటనో, ఏమనుకుంటారనో ఇవ్వడానికి సందేహించాను. నాలో నేనే చాలా సేపు తర్కించుకున్నాను.
ఎలాగైతే ఇవ్వాలనే నిర్ణయానికొచ్చేసి, ఇచ్చేశాను. సరదాగా, కలివిడిగా ఉండే కరుణే కల్పించుకొని చాక్లెట్స్‌తోనే సరిపెట్టేద్దామనా ... అనేసి, నా నుండేమి సమాధానం రాకపోయే సరికి రాఖీలు కట్టిన వాళ్ళకి వాళ్ళ బ్రదర్స్ డబ్బులు గట్టిగానే ఇస్తారు తెల్సా ... నువ్వెంతిస్తున్నావో ... అంది నవ్వేస్తూ.
శైలు ఏమీ అడగలేదు గానీ, అలాగే నా నుండి ఏం జవాబు వస్తుందో నన్నుట్లు చూస్తోంది. నేలకేసి చూస్తూ మళ్ళీ ఓ చిరునవ్వు నవ్వాను. నేలమీద పడిన నవ్వులో నా భావాన్ని ఏమి వెతుక్కున్నారో గాని నన్నింకేమీ అడగలేదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
|
| |
| | | |
|
|
|
|
|
| ధార్మిక కథనాలు - అన్ని రకాల సుఖ, సంతోషాలకు మూల కారణం సంతృప్తిగా నిర్వచించారు మన పెద్దలు. |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| పెరటి వైద్యం - కొబ్బరిని మనం దినచర్యలో తరచుగా ఏదో ఒక దానికి ఉపయోగిస్తూనే ఉంటాం. |
| |
|
|
|
|
|
|
|